Sobhita Photos: మెక్సికోలో నాగచైతన్య, శోభిత.. హానీమూన్ ఫోటోస్ ట్రెండింగ్!
సినిమా పరిశ్రమలో టాప్ స్టార్స్ నాగచైతన్య, శోభితా ధూళిపాల ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో గత కొద్దికాలంగా బీజీగా లైఫ్‌ను గడిపారు. గత కొద్ది నెలలుగా బిజీ లైఫ్‌తో క్షణం తీరికలేకుండా గడిపిన ఇద్దరు కొత్త దంపతులు కాస్త తమ విధులకు విరామం ప్రకటించి.. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఫారిన్‌లో వెకేషన్‌కు వెళ్లారు. విదేశాల్లోని అద్బుతమైన ప్రదేశాల్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. వారు చేసిన ఫోటోలు అభిమానులు రీ షేర్ కొడుతూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఆ ఫోటో వెనుక ఉన్న కథలోకి వెళితే..
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన శోభితా ధూళిపాల అక్కినేని వారసుడు నాగచైతన్యతో పరిచయాన్ని ప్రేమగా మార్చింది. అనంతరం వారిద్దరూ ఒకరి మనసులు ఒకరు తెలుసుకొన్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇరు కుటుంబాల దృష్టికి వారి ప్రేమకథను తీసుకెళ్లి వారిని ఒప్పించారు. దాంతో వారిద్దరికి 2024 ఆగస్టులో నిశ్చితార్థం జరిపించారు.

ఇక తండేల్ షూటింగ్‌లో బిజీగా ఉన్న నాగచైతన్య కాస్త టైమ్ తీసుకొని పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేసుకొన్నారు. శోభితతో తన వివాహాన్ని డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇరు కుటుంబాలు, సినీ పెద్దల సమక్షంలో ఘనంగా కల్యాణం జరిపించుకొన్నారు. ఆ తర్వాత తండేల్ సినిమా షూటింగు, ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయారు.
ఫిబ్రవరి 7వ తేదీ వరకు నాగచైతన్య తండేల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను 100 క్లబ్‌లో చేర్చిన తర్వాత తన భార్యతో కలిసి ఫారిన్ వెకేషన్స్‌కు ప్లాన్ చేసుకొన్నారు. పెళ్లి తర్వాత హానీమూన్ ట్రిప్‌గా ఈ వెకేషన్‌ను ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది. వారిద్దరు కలిసి మెక్సికో, ఆమ్‌స్టర్‌డామ్‌లోని సుందర ప్రదేశాల్లో విహరిస్తున్నారు.
నాగచైతన్యతో కలిసి చేస్తున్న ఫారిన్ టూర్‌కు సంబంధించిన 9 ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో శోభితా ధూళిపాల షేర్ చేశారు. వారిద్దరూ కలిసి WWF లాంటి ఓ స్పోర్ట్స్ లైవ్ షోను చూస్తూ తీసిన ఫోటోను షేర్ చేశారు. అలాగే వారు తిన్న సమోసాలను కూడా ఫోటో తీసి ఇన్స్‌టాలో పెట్టింది. ఇది మా వైబ్ అంటూ కామెంట్స్ చేసింది.

అలాగే ఫారిన్ వెకేషన్‌లో శోభితా ధూళిపాల దిగిన గ్లామరస్ పిక్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. బ్లాక్ డ్రస్‌లో దిగిన ఫోటోను చూసి ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇద్దరిని చూస్తుంటే మాకు ఫుల్ వైబ్‌గా ఉంది. మీరు యూనిక్ పర్సనాలిటీ. మీలాంటి బ్యూటీఫుల్ లేడీని పొందడం నాగచైతన్య నిజంగా లక్కీ పర్సన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ పోటోలకు లక్షల్లో లైక్స్ రావడం విశేషంగా మారింది.
నాగచైతన్య, శోభిత కేరీర్ విషయానికి వస్తే.. తండేల్‌తో బ్లాక్ బస్టర్ సాధించిన చైతూ మరో సినిమాకు సిద్దమవుతున్నాడు. చైతూ ఓ వెబ్ సిరీస్, ఇంకా ఓ తెలుగు సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక శోభిత పెళ్లి తర్వాత ఇటీవల తొలి షూటింగ్‌కు హాజరయ్యారు. కొన్ని ప్రాజెక్టులు అంగీకరించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











