శోభితను ప్రేమించి పెళ్లి చేసుకొన్నా.. నా పరువు తీయకండి.. నాగచైతన్య ఎమోషనల్

తెలుగు సినిమా ప్రపంచంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం తండేల్. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యువ సామ్రాట్ ఏమని మాట్లాడరంటే?

నా జీవితంలో నిజంగా తండేల్ నిర్మాత అల్లు అరవింద్ గారే. సినిమా చివరకు వచ్చే సరికి ఆయన లేకుండా నేను మరో సినిమా ఎలా చేస్తానా? అనే ఫీలింగ్ కలిగింది. ఆయన ఇచ్చే గైడెన్స్ జీవితాంతం గుర్తుంచుకొంటాను. ఈ సినిమా నా జీవితంలో మరిచిపోలేనటువంటిది అవుతుంది అని నాగచైతన్య అన్నారు.

Sobhita Dhulipala s Husband Naga Chaitanya emotional Speech at Thandel Trailer Launch at Vizag

వైజాగ్ విషయానికి వస్తే.. నేను వేదికల మీద ఎన్నోసార్లు చెప్పాను. ఏ సినిమా రిలీజైనా నేను వైజాగ్‌లో టాక్ తెలుసుకొంటాను. వైజాగ్‌లో సినిమా ఆడిందంటే.. ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. నా హృదయానికి ఈ నగరం ఎంత క్లోజ్ అంటే.. వైజాగ్ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకొన్నాను. పెళ్లి తర్వాత నా ఇంట్లో వైజాగ్ కూడా ఉంది అంటూ చైతూ కామెంట్ చేశాడు.

నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. కాబట్టి మీకు నాది చిన్న రిక్వెస్ట్. తండేల్ సినిమాకు కలెక్షన్లు షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ మూవీని స్టార్ట్ చేసేటప్పుడు దర్శకుడు చందూ మొండేటి ఓ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్‌ను గుర్తు పెట్టుకొన్నాను. ఫిబ్రవరి 7వ తేదీన కలెక్షన్ల జాతరే అని నాగచైతన్య అన్నాడు.

Sobhita Dhulipala s Husband Naga Chaitanya emotional Speech at Thandel Trailer Launch at Vizag

నాన్న కింగ్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. వస్తున్నాం. కొడుతున్నామని చెబుతుంటారు. తండేల్ రాజా స్టయిల్‌లో చెబితే.. గట్టిగా హిట్ కొట్టబోతున్నాం అంటూ నాగచైతన్య తన స్పీచ్‌ను ముగించారు. తండేల్ సినిమా ట్రైలర్‌కు విశేషమైన రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ ట్రైలర్‌లో నాగచైతన్య, సాయిపల్లవి జంట కెమిస్ట్రీ అదిరిపోయిందనే మాట నెటిజన్ల నుంచి వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X