యంగ్ కమెడియన్ హీరోతో రొమాన్స్‌కు సిద్దమైన నిహారిక.. ఫ్యాన్స్ షాక్ !
టాలీవుడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమిడియన్స్ లో ప్రియదర్శి పులికొండ ఒకరు. తన కామెడీ టైమింగ్ తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 'మల్లేశం', 'జాతి రత్నాలు', 'బలగం', రీసెంట్ గా 'డార్లింగ్' వంటి సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. తాజాగా ఆయన హీరోగా మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతోంది. అందులో హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం?
ప్రియదర్శి పులికొండ (Priyadarshi) టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకరు. 2016లో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కిన 'పెళ్లి చూపులు' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాలోనే తన కామెడి టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రారాజు ప్రియదర్శి. ఈ సినిమా సుపర్ హిట్ కావడంతో ప్రియదర్శికి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు, గుర్తింపు వచ్చింది.

ఆ తరువాత అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు వంటి పలు సినిమాల్లో నటించి, తన కామెడీ టైమింగ్ తో ఫ్యాన్స్ చంపేశారు. ఈ సమయంలో ప్రియదర్శిలోని నటుడుని గుర్తించిన డైరెక్టర్ ఆయనకు హీరోగా చాన్స్ ఇచ్చారు. ఇలా.. మల్లేశం ,బలగం వంటి సినిమాల్లో హీరోగా నటించి, విమర్శకులను సైతం మెప్పించారు. అలా హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్న ప్రియదర్శి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరోవైపు కమిడీయన్ గా కూడా రాణిస్తున్నారు.
ఇటీవల ప్రియదర్శి హీరోగా వచ్చిన డార్లింగ్ అనే సినిమా కాస్త నిరాశపరిచినా.. ఆయన రేంజ్ ఏ మాత్రం పడిపోలేదు. బడా బడా బ్యానర్ లు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ కి చెందిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ముందుకు వచ్చింది. ఈ బడా సంస్థ ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను తెరకెక్కబోతుందట. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉందట. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ ఆప్టేడ్ టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ప్రియదర్శితో ఓ ఫేమస్ హీరోయిన్ రోమాన్స్ చేయనున్నారన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె మరెవరో కాదు నిహారిక.. 'నీహారిక ఏంటీ? ప్రియదర్శితో హీరోయిన్ గా చేయడమేంటీ?'అని షాక్ అవుతున్నారు. వెయిట్.. వెయిట్.. మీరు అనుకుంటున్నా మెగా డాటర్.. నిహారిక కొణెదెలా .. కాదండీ బాబు.. ఈ నిహారిక వేరు..
ఆ హీరోయిన్ పేరు నిహారిక ఎన్ఎం (Niharika). ఈమె సోషల్ మీడియాలో ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్, ఫేమస్ కంటెంట్ క్రియేటర్ కూడా. ఆమె అడివి శేష్ 'మేజర్' కోసం.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం.. అలాగే 'కేజీఎఫ్' యశ్ కోసం పలువురు హీరోలకు ప్రమోషనల్ వీడియోలు చేశారు. ఇప్పుడీ ఈ అమ్మడు హీరోయిన్ గా ప్రియదర్శి సినిమా తెరకెక్కనున్నందట. పలు సినిమాలకు సక్సెస్ పుల్ ప్రమోషన్లు చేసిన ఈ అమ్మడు ఇక ప్రియదర్శి సినిమాతో హీరోయిన్ గా మారుతుంది. టాలెంటెడ్, గ్లామరస్ బ్యూటీ నిహారిక.. హీరోయిన్ గా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచిచూడాలి


Click it and Unblock the Notifications











