విభిన్న కథాంశంతో సమంత.. టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ డైరెక్టర్
దర్శకులు శేఖర్ కమ్ముల, శివ నిర్వాణ స్పూర్తితో టాలీవుడ్‌లోకి మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముఖేష్ కుమార్ అడుగుపెడుతున్నారు. సమంత టైటిల్‌తో ఇండిపెండెంట్ ఫిలిమ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.
హిప్నాటిజం నేపథ్యంలో... హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "సమంత" చిత్రంలో సిరి కనకన్ టైటిల్ రోల్ పోషించగా... లిరిన్, రమేష్ నీల్ (యాంకర్ రమేష్), చరణ్, శ్రీకాంత్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు.

సమంత చిత్రం ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపిక కావడం గమనార్హం. ఇక తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
సమంత మూవీని రిలీజ్ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు ముఖేష్ కుమార్ మాట్లాడుతూ.. మంచి కథ, ఆసక్తికరంగా కథనంతో ఈ చిత్రం రూపొందింది. తనతోపాటు ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటులకు మంచి పేరు తెస్తుంది అని అన్నారు.
ఇక ముఖేష్ కుమార్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడలిస్ట్. పలు భారతీయ భాషలతోపాటు ఫ్రెంచ్, అరబిక్ లాంటి విదేశీ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్‌ను పెంచుకొన్న ముఖేష్ కుమార్ భారీ వేతనాన్ని వదులుకొని టాలీవుడ్ బాట పట్టారు.
రచన, దర్శకత్వం: ముఖేష్ కుమార్
సంగీతం: వీఆర్ఏ ప్రదీప్
ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల
కెమెరా: అశోక్ రత్నం
పిఆర్వో: ధీరజ అప్పాజీ
నిర్మాణం: లియో ఫిల్మ్ కంపెనీ


Click it and Unblock the Notifications











