twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపోయిన సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకే ముడి పెట్టేశాడు! మామూలోడు కాదండీ బాబు

    |

    Recommended Video

    Software Sudheer Movie Official Teaser

    జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్.. ఆ పేరులోనే ఉంది గాలి. ఆ గాలి ఎప్పుడు ఎవరి పైకి వీచి ఎలా పంచులేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కమెడియన్‌గా పలు టీవీ ప్రోగ్రామ్స్, లైవ్ కార్యక్రమాల్లో అందరిపై పంచులేసే ఈ సుడిగాలి.. ఈ సారి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ముడి పెట్టేశాడు. ఈ సీన్ ఎంచక్కా వెండితెరపై చూసి ఎంజాయ్ చేయొచ్చు. అర్థం కాలేదా..? అయితే ఓ లుక్కేయండి.

    అనసూయ, రష్మీ బాటలో సుడిగాలి సుధీర్

    అనసూయ, రష్మీ బాటలో సుడిగాలి సుధీర్

    బుల్లితెరపై తమ మార్క్ చూపిన నటీనటులంతా వెండితెర బాట పట్టేస్తున్నారు. చిన్న తెరపై వీళ్ళ హంగామా చూసి ఫిదా అవుతున్న దర్శక నిర్మాతలు వీళ్ళ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా హాట్ యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీ ముఖి, చమ్మక్ చంద్ర పేర్లు చెప్పుకోవచ్చు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా ఈ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. సుధీర్ హీరోగా కొత్త సినిమా రాబోతోంది.

    సుడిగాడి తొలి సినిమా

    సుడిగాడి తొలి సినిమా

    శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన 'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    సుడిగాలి కాదు ఇక సాఫ్ట్‌వేర్ సుధీర్

    సుడిగాలి కాదు ఇక సాఫ్ట్‌వేర్ సుధీర్

    ఈ చిత్రానికి 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని అతిత్వరలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

    వీడు మామూలోడు కాదండీ బాబు

    తాజాగా విడుదలైన సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్ చూస్తే.. వీడు మామూలోడు కాదండీ బాబు అని ప్రతీ ఒక్కరూ అనాల్సిందే. మాస్, క్లాస్ అన్ని రకాల వేషాలు వేస్తూ చిందరవందర చేసేశాడు సుడిగాలి సుధీర్. ట్రైలర్‌లో అంతా సుడిగాలి సుధీర్ హంగామానే కనిపించింది. ట్రైలర్‌ని బట్టి చూస్తే మనోడు వెండితెరపై కూడా సుడిగాలి సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.

    భలే అర్ధం చెప్పాడే..!

    భలే అర్ధం చెప్పాడే..!

    ఇక ఈ ట్రైలర్‌లో ఓ సన్నివేశం హైలైట్ గా నిలిచింది. బాబు గారి పేరేంటో.. అని ఓ పెద్దాయన అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు సుధీర్. తన పేరు చందు అని, చంద్రబాబు ఇంటు చంద్ర శేఖర్ రావు ఈక్వల్ టు చందు అని తన ఫ్రెండ్స్ అంతా అంటుంటారని చెబుతూ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకే ముడి పెట్టేశాడు సుధీర్.

    English summary
    Jabardasth feam Sudigali Sudheer enter into the cinema. His first movie Software Sudheer is comes shortly. Now this movie trailer released and creating sensations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X