మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా 'సాఫ్ట్‌వేర్ సుధీర్' వెబ్‌సైట్..
బుల్లితెర పాపులర్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ 'సాఫ్ట్‌వేర్ సుధీర్'. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'రాజుగారి గది' ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇటీవల విడుదలైన 'సాఫ్ట్‌వేర్ సుధీర్' ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో 1.5 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా 'సాఫ్ట్‌వేర్ సుధీర్' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తెలంగాణ సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణమంత్రి మల్లారెడ్డి, చిత్ర నిర్మాత కె.శేఖర్ రాజు, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాటలో నటించారు. సీనియర్ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్, షాయాజీ షిండే, డా. ఎన్. శివప్రసాద్, పృథ్వీ, సంజయ్ స్వరూప్, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











