హీరో సోహైల్ ఇంట తీవ్ర విషాదం.. శోక సంద్రంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్

తెలుగు సినిమా రంగంలో యువ హీరో, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ సోహైల్ సయ్యద్ ర్యాన్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. గత కొద్దికాలంగా అనారోగ్యానికి గురైన తన తల్లి మరణంతో పుట్టెడు శోఖంలో మునిగిపోయాడు. మతృ వియోగంతో బాధపడుతున్న ఆయనకు స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

సోహైల్ సయ్యద్ తల్లి కొద్దికాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. హైటెక్ సిటీ మెడికవర్ హస్పిటల్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ జరుగుతున్నది.

Sohel Syed Ryan s mother faima Sultana passed away due to Kidney failure

అయితే రెండు రోజులుగా సోహైల్ తల్లి ఫైమా సుల్తానా అనారోగ్యం క్షీణించింది. దాంతో ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. డయాలిసిస్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దాంతో ఈ మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. దాంతో సోహైల్ కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది.

సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని తన స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనికి తరలించారు. ఆమె అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శోక సంద్రంలో మునిగిన సోహైల్‌కు సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలు సంతాపం తెలియజేస్తున్నారు.

Sohel Syed Ryan s mother faima Sultana passed away due to Kidney failure

వరుణ్ సందేశ్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు ద్వారా తెలుగు వారికి మరింత చేరువయ్యారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మెగాస్టార్ చిరింజీవి లాంటి స్టార్స్ హీరోల ఆదరణకు గురయ్యారు.

బిగ్‌బాస్ తర్వాత సోహైల్ సినీ రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు లాంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఈ క్రమంలో మాతృవియోగం జరగడం విషాదంగా మారింది.

More from Filmibeat

Read more about: sohel syed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X