పెళ్లి చేసుకోవద్దు అంటూ.. రానాకు వార్నింగ్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముగ్గురు హీరోలు సింగిల్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టడంతో ఒక్కసారిగా మీడియాలో ఆ మ్యాటట్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ సాంగ్ తో పెళ్లి వద్దు అంటూ హితబోధ చేయగా.. వరుణ్ తేజ్ ఆ సాంగ్ లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక ఈ సాంగ్ తో వాళ్ళు రానాకు వార్నింగ్ ఇచ్చినట్లే అనే కామెంట్స్ వస్తున్నాయి.

సోలో బ్రతుకె సో బెటర్..
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికె ఆ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. అనుకోని విదంగా వాయిదా పడ్డ ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. సోలో లైఫ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ లైఫ్ గురించి సినిమాలో చాలా సరదాగా చెప్పారట.

నో పెళ్లి సాంగ్..
ఇక ఫైనల్ గా సినిమాలో మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని నో పెళ్లి అనే సాంగ్ చాలా బాగానే డిజైన్ చేశారు. పెళ్లి చేసుకుంటే ఒక మగాడు సంసార జీవితాన్ని ఎదుర్కోలేడు అంటూ చాలా సరదాగా చెబుతున్నారు సాయి ధరమ్ తేజ్. పెళ్లి చేసుకోవద్దు అంటూ ఇలాంటి సరదా సాంగ్స్ చాలానే వచ్చాయి. కానీ ఈ సాంగ్ ని చిత్ర యూనిట్ నేటి తరానికి అర్థమయ్యేలా చాలా క్లియర్ గా చెప్పేసింది. కాగా ఈ పాట యూట్యూబ్‌లో నంబర్ 1గా ట్రెండ్ అవుతున్నది.

వరుణ్ తేజ్, రానా స్పెషల్..
ఇక ఈ సాంగ్ లో స్టార్ యాక్టర్స్ వరుణ్ తేజ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. పెళ్లికి సిద్దమైన రానా కూడా అప్పుడే పెళ్లొద్దు అంటున్నాడు అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పవనే రేంజ్ లో..చెబుతూ.. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు ఈ స్టార్ హీరోలు.

సినిమా రిలీజ్ ఎప్పుడు?
ఇకపోతే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. దాదాపు సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ పై రెండు నెలల తరువాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











