Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సోలో బ్రతుకే సో బెటర్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ కూడా రెడీ!
ఈ ఏడాది థియేటర్స్ నిజంగా ఓపెన్ అవుతాయా అనే అనుమానాలు ఆడియెన్స్ లో ఎంతగానో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేశాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా కరోనా దెబ్బకు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా సినిమాలు వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యాయి. అయితే ఈ డిసెంబర్ లో కొన్ని థియేటర్స్ ఓపెన్ కావడంతో కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాయి. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ కూడా సిద్ధమైంది.
మొత్తానికి భయం తగ్గడంతో..
ఇక మెగా హీరో సాయి ధరమ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఎప్పుడో సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి కరోనా భయం తగ్గడంతో జనాలు థియేటర్స్ లోకి వస్తారని నమ్మకంతో నిర్మాతలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
రిలీజ్ డేట్ ఫిక్స్..
ఫైనల్ గా ఈ నెల 25న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారట. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇక విడుదలైన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అదే సెంటిమెంట్ తో..
సాయి ధరమ్ తేజ్ గత ఏడాది డిసెంబర్ 20న ప్రతి రోజు పండగే సినిమాను విడుదల చేశాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఇప్పుడు డిసెంబర్ లోనే సోలో బ్రతుకే లో బెటర్ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు.
జనాలు థియేటర్స్ వరకు వస్తారా?
అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం జనాలు థియేటర్స్ వరకు వస్తారా లేదా అనేది పెద్ద సందేహం. భయమైతే పోయినట్లు అర్ధమయ్యింది గాని ఇటీవల విడుదలైన సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి మెగా హీరో తన క్రేజ్ తో థియేటర్స్ వరకు రప్పిస్తాడో లేదో చూడాలి. ఇక సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మించగా సుబ్బు దర్శకత్వం వహించారు. మరి సినిమా ఈ టైమ్ లో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.