twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK108: బాలయ్య ఆఫర్‌పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్.. ఎలా వదులుతారు అంటూ!

    |

    బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. ఆరంభంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్న ఆయన.. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక, గత ఏడాది బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' మూవీతో బాలయ్య మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన వరుసగా కొత్త సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నారు.

    టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!

    నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇది షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకున్నారు. దీన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే అనిల్ రావిపూడి ఈ మూవీ కోసం తొలిసారి తన పంథాను మార్చుకుని ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

     Sonakshi Sinha Clarity on Balakrishna and Anil Ravipudi Movie

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తుందని ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. తాజాగా దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు తన ఖాతాలో 'ఓ తెలుగు సినిమా కోసం నన్ను ఎంపిక చేశారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. అంతేకాదు, ఇప్పుడు ఆ మూవీ నుంచి నన్ను తప్పించారని కూడా టాక్ నడుస్తోంది. అసలు ఎంపికే చేయని యాక్టర్‌ను ఎవరూ తప్పించలేరు అని క్లారిటీ ఇవ్వాలనుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో పేరు చెప్పకపోయినా ఆమె బాలయ్య సినిమా గురించే మాట్లాడినట్లు అర్థం అవుతోంది.

    నిధి అగర్వాల్ ఎద అందాల ఆరబోత: హద్దు దాటేసి మరీ హాట్ షోనిధి అగర్వాల్ ఎద అందాల ఆరబోత: హద్దు దాటేసి మరీ హాట్ షో

     Sonakshi Sinha Clarity on Balakrishna and Anil Ravipudi Movie

    ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణిని తీసుకున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, శ్రీలీలా ఇందులో ఆయన కూతురిగా నటిస్తుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

    English summary
    Nandamuri Balakrishna Will Do a Movie Under Anil Ravipudi Direction. Sonakshi Sinha Gives Clarity on This Movie Offer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X