దంబంగ్ 3పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా
దంబంగ్ సినిమాతో ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హా చాలా రోజుల తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్‌తో జతకట్టింది. తాజాగా దంబంగ్ 3 చిత్రంలో సల్లూభాయ్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే తన పాత్రపై వస్తున్న గాసిప్స్ గురించి సోనాక్షి స్పందించింది.
దంబంగ్ సినిమాలో సోలో హీరోయిన్‌గా చేస్తున్నాను. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రకు స్కోప్ లేదు. ముక్కొణపు ప్రేమ కథ అసలే లేదు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు, తనకు మధ్య కథ నడుస్తుందనే విషయం వాస్తవం కాదు అని సోనాక్షి అన్నారు.

దంబంగ్ 3 కథ గురించి వస్తున్న ఊహాగానాలు అంతా తప్పే. మీడియా అనుకొంటున్నట్టు కథ అది కాదు. కథ, పాత్రలు కొత్తగా ఉంటాయి. పాత చింతకాయ పచ్చడిని వడ్డించడం లేదు. ఆడియెన్స్ థ్రిల్ అయ్యేలా కథ ఉంటుంది. ఈ సినిమా చక్కటి అనుభూతికి అందిస్తుంది అని సోనాక్షి అన్నారు.
దంబంగ్1లో మలైకా అరోరా, దంబంగ్ 2లో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్స్ చేశారు. దంబంగ్ 3లో అలాంటిదేమైనా ఉంటుందా అనే ప్రశ్నకు జవాబిస్తూ.. మున్ని బాద్నాం హుయి లాంటి పాటలకు స్కోప్ లేదు. కానీ మున్నా ఉంటాడు. మరింత వినోదాన్ని పంచుతాడు అని సోనాక్షి చెప్పింది.


Click it and Unblock the Notifications











