చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ: అదిరిపోయే ప్లాన్ చేసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి సినిమాల్లో నటించిన ఆయన.. ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే.. మెగాస్టార్ మరికొన్ని ప్రాజెక్టులను ప్రకటించారు. అందులో మలయాళ చిత్రం 'లూసీఫర్' రీమేక్, తమిళ చిత్రం 'వేదాళం' రీమేక్‌తో పాటు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.
మిగిలిన వాటిని పక్కన పెడితే.. బాబీ తెరకెక్కించే చిత్రంపై మెగా అభిమానులు ఇప్పటి నుంచి అంచనాలు ఏర్పరచుకుంటున్నారు. దీనికి కారణం అతడు వరుసగా విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతుండడమే. ఇప్పటికే పలు హిట్లను అందుకుని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బాబీ.. చిరంజీవి కోసం అదిరిపోయే మాస్ ఎంటర్‌టైనర్ స్టోరీని రెడీ చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హాను తీసుకోబోతున్నారని తెలిసింది. త్వరలోనే ఆమెకు కథను చెప్పనున్నాడట బాబీ.

ప్రస్తుతం బాలీవుడ్‌లో 'బూజ్' అనే సినిమాలో మాత్రమే నటిస్తోంది సోనాక్షీ. ఇండో - పాక్ వార్ నేపథ్యంతో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత మరో సినిమాను ఫైనల్ చేయని ఆమె.. మెగాస్టార్‌తో నటించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అదే కుటుంబానికి చెందిన సాయి ధరమ్ తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ నటించబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











