‘F3’ హైలైట్ కానున్న స్పెషల్ సాంగ్: అదరగొట్టబోతున్న బాలయ్య హీరోయిన్లు

కొన్నేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ హిట్‌ను అందుకున్న చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్దాజా హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు దీన్ని నిర్మించాడు. పెళ్లి తర్వాత హీరోలిద్దరూ ఎదుర్కొన్న కష్టాలను ఫన్నీగా చూపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫలితంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీనికి ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీకైంది.

హిట్ కాంబోతో రూపొందుతోన్న సీక్వెల్ చిత్రమే 'F3'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మరింత ఫన్‌తో తీస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే వెల్లడించాడు. అందుకు అనుగుణంగానే దీన్ని మరింత ఫన్నీగా తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. సెకెండాఫ్‌లో వచ్చే ఈ పాటలో హాట్ బ్యూటీలు సోనాల్ చౌహాన్, ప్రగ్యా జైస్వాల్ కలిసి చిందేయబోతున్నారని తెలుస్తోంది. వీళ్లతో పాటు హీరోలు కూడా ఇందులో అదరగొడతారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ స్పెషల్ సాంగ్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడుతున్నాయి.

Sonal Chauhan and Pragya Jaiswal in F3 Special Song

డబ్బు వల్ల కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఫ్రస్టేషన్‌ను ఫన్నీగా చూపిస్తూ 'F3' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్ర షూటింగ్‌ను జూలై మొదటి వారం నుంచి పున: ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. సీనియర్ హీరోయిన్ సంగీత కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 'F2'ను మించి పోయేలా దీన్ని తీస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X