Ghost: హాట్ బ్యూటీతో జత కట్టనున్న నాగార్జున.. కాజల్ స్థానాన్ని ఆమెతో భర్తీ చేసేశారట
చాలా కాలంగా హిట్‌ను సొంతం చేసుకోవడంలో విఫలం అవుతూ.. పరాజయాల పరంపరతో తెగ ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. దాని తర్వాత రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆయనకు విజయం మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున ఈ ఏడాది ఆరంభంలో 'వైల్డ్ డాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా... ప్రతికూల పరిస్థితులు, ఇతర కారణాల వల్ల కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు.
ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున పలు చిత్రాలను చేస్తున్నాడు. అందులో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తోన్న 'ఘోస్ట్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభం అయింది. దీంతో ఆ అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టినట్లు అయింది. అయితే, ప్రస్తుతానికి మాత్రం నాగ్ బంగార్రాజు ప్రాజెక్టుతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదనే టాక్ వినిపిస్తోంది.

నాగార్జున కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీని వెనుక పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక, ఈ మూవీలో ఆమె స్థానాన్ని గోవా బ్యూటీ ఇలియానా భర్తీ చేయబోతుందని కూడా ఓ వార్త తెగ వైరల్ అయింది. ఆ తర్వాత మెహ్రీన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ, ఈ విషయం చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'ఘోస్ట్' మూవీలో కాజల్ అగర్వాల్ స్థానంలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నారట. ఇప్పటికే ఆమెకు దర్శకుడు స్టోరీ లైన్ వినిపించగా.. ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని తెలిసింది. అంతేకాదు, ఈ మూవీ కోసం ఆమెకు భారీ మొత్తం చెల్లిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మరికొద్ది రోజుల్లోనే ఆమె ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కొంత కాలంగా సోనాల్ చౌహాన్ తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, 'ఎఫ్3' మూవీలో మాత్రం ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఊహించని పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











