దగ్గుబాటి రానాకు స్టార్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అలాంటి వాళ్లు అంటూ షాకింగ్ పోస్ట్

అగ్ర కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రానా అప్పట్లోనే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు. దీంతో ఆయనకు ఇతర చిత్ర పరిశ్రమల నుంచి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ చనువుతో ఇటీవల ఓ హీరోయిన్ పై రానా చేసిన వ్యాఖ్యలు నెగెటివటీకి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆ హీరోయిన్ చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

రానా చిత్రాలు:శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో సినీ కెరీర్ మొదలు పెట్టిన దగ్గుబాటి రానా నటనతో ఆకట్టుకున్నాడు. తర్వాత వెంటనే దమ్ మారో దమ్ అనే హిందీ మూవీ, తెలుగులో నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, ఆరంభం, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, అరణ్య, భీమ్లా నాయక్, విరాట పర్వం వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు రానా.

Sonam Kapoor Counter To Rana Daggubati Over His Comments

ఆగస్ట్ 24న:హిందీలోడిపార్ట్ మెంట్, యే జవానీ హై దివానీ, సమ్ థింగ్ సమ్ థింగ్, వెల్ కమ్ టు న్యూయార్క్, హౌజ్ ఫుల్ 4 వంటి హిందీ చిత్రాల్లో సైతం మెప్పించాడు రానా. అయితే ఇటీవల సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోత' (King of Kotha) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్ పై అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 24న విడుదల కానుంది.

ద జోయా ఫ్యాక్టరీ:కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నానితోపాటు దగ్గుబాటి రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సహనం గురించి పొగుడుతూ పేరు చెప్పకుండా ఓ స్టార్ హీరోయిన్ ఉద్దేశించి రానా కామెంట్స్ చేశాడు. అయితే 2018లో దుల్కర్ నటించిన ద జోయా ఫ్యాక్టరీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ నటించింది. ఆ సమయంలో షూటింగ్ స్పాట్ కు రానా వెళ్లినట్లుగా చెప్పాడు.

Sonam Kapoor Counter To Rana Daggubati Over His Comments

రానా క్షమాపణలు:ది జోయా ఫ్యాక్టరీ షూటింగ్ స్పాట్ లో సోనమ్ కపూర్ ప్రవర్తించిన తీరుకు అందరూ సహనం కోల్పోయినా.. దుల్కర్ మాత్రం ఓపికగా ఉన్నారని రానా చెప్పాడు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు తప్పుగా అన్వయించబడ్డాయని, సోనమ్, దుల్కర్ కు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు రానా ట్వీట్ కూడా చేశాడు. రానా క్షమాపణలు చెపిన వెంటనే సోనమ్ కపూర్ ఓ పోస్ట్ పెట్టింది.

Sonam Kapoor Counter To Rana Daggubati Over His Comments

సంకుచితమైన మైండ్ సెట్:యూఎస్ ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్ వెల్ట్ రాసిన కొటేషన్ షేర్ చేసింది సోనమ్ కపూర్. ఆ కొటేషన్ లో "సంకుచితమైన మైండ్ సెట్ గలవారే పర్సన్స్ గురించి చర్చిస్తారు. యావరేజ్ మైండ్ వాళ్లు సంఘటనలపై మాట్లాడతారు. అలాగే గొప్ప మేధావులు ఆలోచనల గురించి డిస్కస్ చేస్తారు" అని ఉంది.

Sonam Kapoor Counter To Rana Daggubati Over His Comments

సోనమ్ కపూర్ ఫ్రెండ్:అలాగే ఆ పోస్టుకు "నేను కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రత్యేకించి అలాంటి వ్యక్తుల గురించి" అంటూ సోనమ్ రాసుకొచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి రానాను ఉద్దేశించే సోనమ్ కపూర్ పెట్టింది అని నెటిజన్లు అనుకుంటున్నారు. కాగా రానా భార్య మిహికా బజాజ్ కు సోనమ్ కపూర్ మంచి స్నేహితురాలని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X