Sonia Agarwal టాలీవుడ్ రీ ఎంట్రీ.. హాట్ హాట్‌గా 7/G బృందావన్ కాలని హీరోయిన్
హీరోయిన్ సోనియా అగర్వాల్ అంటే ఠక్కున గుర్తొచ్చేంది 7/G బృందావన్ కాలని. ఈ చిత్రంలో అద్బుతమైన నటనను ప్రదర్శించి అందర్ని ప్రశంసలు అందుకొన్నారు. అయితే ఊహించని విధంగా ఆమె సినీ రంగం నుంచి తప్పుకోవడం అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో డిటెక్టివ్ సత్యభామగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనియా అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'డిటెక్టివ్ సత్యభామ'. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న సుమారు 500 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్, టీజర్, పాటలను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ విడుదల చేశారు. డిటెక్టివ్ సత్యభామ చిత్రంలోని ట్రైలర్‌ను నిర్మాత పోలెమోని శ్రీశైలం, మొదటి పాటను రాజ పోలెమోని, నటి సునీత పాండే రెండవ పాటను, సినీ పీఆర్వో ఆర్‌కే చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో_

చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ.. 7 జి బృందావనం ఫేమ్ సోనీ అగర్వాల్ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాలను ఆకట్టుకొంటుంది. స్క్రీన్‌మాక్స్ ప్రసాద్ మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్‌లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకొంటున్నాం అని అన్నారు.
చిత్ర దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ.. వాస్తవానికి నేను సంగీత దర్శకుడిని. నేను చెప్పిన కథను నిర్మాత శ్రీశైలం పోలెమోని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ఇందులో నటించిన వారంతా అద్భుతంగా నటించారు. సాంకేతిక నిపుణులు అంకితభావంతో పని చేశారు. కథ విషయానికి వస్తే... ఎవరూ ఊహించని మలుపు ఉంటాయి. సోనీ అగర్వాల్ యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది అని అన్నారు.
నటీ నటులు: సోని అగర్వాల్, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్ తదితరులు
సంగీతం, దర్శకత్వం: నవనీత్ చారి
బ్యానర్: సినిమా ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: శ్రీశైలం పోలె మోని
కెమెరా, ఎడిటర్: లక్కీ ఏకరి
డైలాగ్: సంతోష్ ఇంగాని
పీఆర్వో : ఆర్.కె. చౌదరి


Click it and Unblock the Notifications











