లాభాల్లో యాభై శాతం.. సోనూ సూద్ ఫన్నీ కామెంట్
ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ సోనూ సూద్ పేరు ఓ బ్రాండ్‌లా మారిపోయింది. కరోనా వైరస్, లాక్డౌన్ కాలంలో సోనూ సూద్ ఓ సూపర్ హీరోగా మారిపోయాడు. వేడుకుంటే ప్రత్యక్షమై. కష్టాలను దూరం చేసే దేవుడిలా రూపాంతరం చెందాడు. ఎన్నో వేల మందికి ఇప్పుడు సోనూ సూద్ దేవుడయ్యాడు. సోనూ సూద్ చేయని సాయమంటూ లేదు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా కూడా సోనూ సూద్ ప్రత్యక్షమయ్యాడు.
చిన్నారి గుండెలకు ఆపరేషన్ అయినా, చదువుకోలేకపోతోన్న ఎంతో మంది విద్యార్థులకు అండగా.. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ ఎంతో మందికి ఉపాధి కల్పించడం.. లాక్డౌన్ వల్ల ఎక్కడెక్కడో చిక్కుకుపోయి కుటుంబాలకు దూరంగా ఉన్న వారిని కలపడం ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. సోనూ సూద్ చేసే మంచి పనులకు హద్దులేమీ ఉండవు. ఆయనపై ఉన్న ప్రేమను పలు రకాలుగా వ్యక్త పరుస్తుంటారు అభిమానులు.

కొందరు తమ పిల్లలకు సోనూ సూద్ పేరు పెడుతున్నారు.. ఊరి పేరు, వీధి పేర్లు మార్చేస్తున్నారు. ఇక ఊరిలో కనీసం సోనూ సూద్ పేరిటి పది పదిహేను షాపులు వెలుస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ సోనూ సూద్ పేరుతో షాపులను ప్రారంభించేశారు. తాజాగా ఓ సప్లయర్ షాపుకు కూడా సోనూ సూద్ పేరు పెట్టేసుకున్నారు. అయితే ఇది తెలుసుకున్న సోనూ సూద్ ఆశ్చర్యపోయాడు. నాకు సప్లయర్స్ షాపు ఉందని తెలియదు.. ఇందులో నాకు యాభై శాతం లాభాల్లో వాట ఇవ్వాలని ఫన్నీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం సోనూ సూద్ ట్వీట్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











