సోనూ సూద్‌కు అరుదైన గౌరవం.. అలా సత్కరించిన ఫోర్బ్స్

కరోనా, లాక్డౌన్ అనేవి ప్రపంచాన్ని ఎలా కుదిపేశాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ఇంకా నాడు తగిలిన దెబ్బల నుంచి పూర్తిగా కోలుకోనే లేదు. కానీ మళ్లీ గతేడాది పరిస్థితులే పునరావృతం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లు కఠిన నిబంధనలు అమలుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే కరోనా, లాక్డౌన్ సమయంలో సామాన్యుల ఆపద్భాందవుడిగా మారిపోయాడు సోనూసూద్. అన్నం కోసం అలమటించే వారికి ఆహారాన్ని అందించాడు.. సొంత గూటికి వెళ్లాలనే చూసిన వారికి బస్సులు, ట్రైన్‌లు, విమానాల్లో తీసుకెళ్లాడు.. ఎవరికి ఎలాంటి ఆపదలు వచ్చినా అండగా నిలబడ్డాడు.. చేతనైన సాయం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఎంతో మందికి ప్రాణాలు పోశాడు. ఇలా సోనూ సూద్ చేసిన చేస్తోన్న మంచి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

 Sonu Sood gets Forbes 2021 leader Leadership Award

అయితే ఈ ఏడాది కాలంలో జరిగిన వాటి గురించి తాజాగా సోనూ సూద్ స్పందించాడు. ఈ సంక్షోభం ఇంకా పోలేదు.. ఇంకా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇంకా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. లాక్డౌన్ రోజును మనమంతా గుర్తు పెట్టుకోవాలి.. ఎంతో మంది ఎన్నో రకాలు బాధలు పడ్డ ఈ రోజును మనం మరిచిపోకూడదు అని సోనూ సూద్ అన్నాడు. సోనూ సూద్‌కు అరుదైన గౌరవం లభించింది. ఫోర్బ్స్ మ్యాగజిన్ వారు సోనూసూద్‌ను 2021 బెస్ట్ లీడర్ షిప్ అవార్డును ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X