దండం పెడుతూ సహాయం అడిగిన మరో సీనియర్ క్రికెటర్.. వెంటనే స్పందించిన సోనూసూద్
దేశంలో ఎక్కువగా సహాయం చేయండి అంటూ సాదారణ జనాలు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా కోవిడ్ మహమ్మారి తీవ్రత ఎక్కువవ్వడంతో ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో సహాయం చేయలేకపోతున్నాయి. దీంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇక వీలైనంత వరకు నటుడు సోనూసూద్ సహయాలు అందిస్తున్నాడు. ఇటీవల మరో ఇండియన్ క్రికెటర్ కు కూడా సోనూసూద్ అడిగిన వెంటనే సహాయం అందించాడు.

మరోసారి అదే ఫార్ములా.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది. దాదాపు అన్ని రాష్టలు కూడా మరోసారి లాక్ డౌన్ ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం అస్సలు తగ్గడం లేదు. సహాయలు చేసే లోపే కొంతమంది ఊపిరి వదిలేస్తున్న విషాద ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.

చిటికెలో స్పందిస్తున్నారు
ఇక కరోనా సమయంలో ఆపద్బాంధవుడిగా కనిపిస్తున్న రియల్ హీరో సోనూసూద్. ఎక్కడ ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కూడా చిటికెలో స్పందిస్తున్నారు. గత ఏడాది అందరిని సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్ గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసిన సోనూసూద్ అప్పటి నుంచి ఏ మాత్రం ఆపకుండా సహాయం చేస్తున్నాడు.

సెలబ్రెటీలకు కూడా..
కేవలం సాధారణ జనాలు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రెటీలు కూడా సోనూసూద్ ను సహాయం అడుగుతున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా కుటుంబ సభ్యుల కోసం ఆక్సిజన్ కావాలని సోషల్ మిడియాలో ఒక ట్వీట్ చేయగనే సోనూసూద్ స్పందించిన విషయం తెలిసిందే.
Recommended Video

హర్భజన్ సింగ్ సహాయం కోరడంతో
ఇక ఇటీవల మరో సీనియర్ ఇండియాన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరడంతో నెటిజన్లు మొత్తం కూడా సోనూసూద్ ను అడగాలని ట్యాగ్ చేశారు. ఇక వెంటనే ఆన్సర్ వచ్చేసింది. తప్పకుండా సహాయం అందుతుందని సోనూసూద్ భరోసా ఇచ్చేశాడు. దీంతో చాలా మంది పొలిటికల్ లీడర్స్ కంటే కూడా సోనూసూద్ వంద రేట్లు గొప్పవాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











