వంద రూపాయల రీచార్జ్ దొరుకుతుందా?.. సోనూ సూద్ సెటైర్
ప్రస్తుతం మన దేశంలో సోనూ సూద్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను తెరపై విలన్‌గా వేషాలు వేసినా.. జనం గుండెల్లో మాత్రం హీరోగా నిలిచాడు. ప్రపంచంలోని సూపర్ హీరోల్లోకెల్లా సోనూ సూద్ మేటి అని జనాలు కీర్తిస్తున్నారు. కరోనా, లాక్డౌన్ కాలంలో సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఇప్పటికీ సోనూ సూద్ సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఎవరికో సోనూ సూద్ వల్ల సాయం అందుతూనే ఉంది.
అలా సోనూ సూద్ ఎంతో మంది పిల్లలకు చదువులు చెప్పిస్తున్నాడు.. చదువుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాడు.. చావు బతుకుల మధ్య ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు.. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.. ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా సోనూ సూద్ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో సోనూ సూద్ అప్పుడప్పుడు సరదా కామెంట్లు కూడా చేస్తుంటాడు.

తన పేరు మీదుగా దేశంలో ఎన్నో షాపులున్నాయన్న సంగతి తెలిసిందే. ట్రైలర్, రీ చార్జ్, రెస్టారెంట్లు ఇలా ఎన్నెన్నో సోనూ సూద్ పేరు మీదున్నాయి. గతంలో తన పేరు మీదున్న రీచార్జ్ షాపుపై సెటైర్ వేశాడు. నాకు ఫ్రీగా రీచార్జ్ చేస్తారా? అని అడిగాడు. మళ్లీ తాజాగా సోనూ సూద్ రీచార్జ్ పాయింట్ అని ఓ అభిమాని కొత్తగా షాపును ప్రారంభించినట్టున్నాడు. దీనిపై సోనూ సూద్ కామెంట్ చేస్తూ.. నాకు వంద రూపాయల రీచార్జ్ దొరుకుతుందా? భాయ్ అని సోనూ సూద్ అడిగేశాడు. ప్రస్తుతం సోనూ సూద్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











