twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లోకి ‘క్రాక్’: రవితేజ పాత్రలో రియల్ హీరో.. అదిరిపోయే ప్లాన్ రెడీ

    |

    'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్ల తర్వాత మాస్ మహారాజా రవితేజ - యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'క్రాక్'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా కేవలం ఐదు రోజుల్లోనే రూ. 18.58 కోట్లు రాబట్టి.. రూ. కోటి పైగానే లాభాలను అందుకుంది. ఫలితంగా సంక్రాంతి బరిలోనే కాకుండా 2021లో ఫస్ట్ హిట్‌గా నిలిచింది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రియల్ హీరోగా పేరొందిన సోనూ సూద్ 'క్రాక్'ను బాలీవుడ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడట. రీమేక్‌లో రవితేజ పాత్రను పోషించడంతో పాటు ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, దీనికి గోపీచంద్‌ మలినేనిని దర్శకుడిగా తీసుకుంటాడా? లేక హిందీ పరిశ్రమకు చెందిన వారిని ఎంపిక చేసుకుంటాడా? అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించిన ప్రకటనను మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడించనున్నారని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

    Sonu Sood to Remake Ravi Tejas Krack

    ఇదిలా ఉండగా, హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న 'క్రాక్' మూవీ కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో మాస్ మహారాజా యాక్టింగ్.. గోపీచంద్ మలినేని టేకింగ్.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అలాగే, సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగెటివ్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. వీరితో పాటు హీరోయిన్ శృతి హాసన్, స్టంట్ శివ, సుధాకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

    English summary
    The cast of Ravi Teja's next project under Gopichand Malineni's direction is getting bigger and bigger with every passing day. The makers have already roped in noted Tamil actor, Samuthirakami and Shruti Hassan for this project. The latest addition to the list is Varalaxmi Sarathkumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X