సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో లెజెండరీ నటుడు మృతి
కరోనా వైరస్ ఇంకా శాంతించడం లేదు. రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సినీ పరిశ్రమపై కరోనా తన పంజా విసురుతోంది. ఇప్పటికే ఎంతో మంది లెజెండరీ సెలెబ్రిటీలు కరోనా బారినపడ్డారు. అందులో కొందరు కరోనాను జయించారు. ఇంకొందరు కరోనా పోరాడి ఓడిపోయారు. తాజాగా బెంగాలీ లెజెండరీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన సౌమిత్ర ఛటర్జీ నేడు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
గత నెలరోజుల క్రితం కరోనా బారిన పడిన నటుడు నేడు మధ్యాహ్నం 12.15 గంటలకు కన్నుమూశారని బెల్లె వ్యూ క్లినిక్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. బరువెక్కిన హృదయాలతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది.. సౌమిత్ర ఛటర్జీ నేడు మధ్యహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని హాస్పిటల్ బృంధం ఓ ప్రకటను చేసింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తమ సంతాపాన్ని ప్రకటించారు.

సౌమిత్ర ఛటర్జీ ఎన్నో తరాల్లో స్ఫూర్తి నింపిన నటుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రేతో కలిసి ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. దాదాపు ఈ ఇద్దరి కాంబోలో 14పైకి చిత్రాలు వచ్చాయి. సౌమిత్ర ఛటర్జీ కెరీర్‌లో ధ వరల్డ్ ఆఫ్ అపు, చారులత, ఆషాని సంకేత్, ఆరణ్యార్ దిన్ రాత్రి, జో బాబ ఫెలూనాథ్ వంటి గొప్ప చిత్రాలెన్నో ఉన్నాయి. అక్టోబర్ 6న కరోనా పాజిటివ్ రావడంతో సౌమిత్ర ఛటర్జీ హాస్పిటల్‌లో చేరారు. అయితే అక్టోబర్ 14న నెగెటివ్ వచ్చినా కూడా ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడటంతో నేడు కన్నుమూశారు.


Click it and Unblock the Notifications











