సౌందర్య ఆస్తి మింగిన మోహన్ బాబు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటి భర్త?
సౌత్ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని ముద్రను వేసుకుంది నటి సౌందర్య. చక్కటి రూపసౌందర్యం, నటనతో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తన కట్టుబొట్టుతో కూడా మరోవైపు హిందూ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను తన దైనశైలిలో అలరించింది. కన్నడకు చెందిన ఈ స్టార్ హీరోయిన్ తెలుగు చిత్రాలతోనే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. మరోవైపు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం చిత్రాల్లో నటించి అప్పుడే పాన్ ఇండియన్ నటిగా ముద్రవేసుకుంది. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. కెరీర్ లో అప్పటి స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
అయితే, సౌందర్య పేరు ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు రెండు తెలుగు స్టేట్స్ లో గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణం సౌందర్య అభిమానిని అంటూ ఓ వ్యక్తి కలెక్షన్ కింగ్, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సౌందర్య పేరు, ఆమె ఆస్తులు, మోహన్ బాబుతో ఉన్న గొడవలేంటీ అనే విషయాలు హాట్ టాపిక్ గ్గా మారాయి. అయితే ఖమ్మం జిల్లా రూరల్ మండలానికి చెందిన సత్యనారాయణపురం గ్రామానికి చెందిన చిట్టిబాబు నిన్న మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.

సౌందర్యను హ్యత చేయించింది మోహన్ బాబునే అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హైదరాబాద్ లో ఉన్న సౌందర్యకు సంబంధించిన ఆస్తులను కాజేయడానికే చంపించాడని ఆరోపించాడు. నటి సౌందర్యది సహజమరణం కాదని పోలీసులకు వివరించాడు. ఇప్పుడు మోహన్ బాబు నుంచి తనకూ ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. ఖమ్మం రూరల్ జిల్లా ఏసీపీకి ఫిర్యాదును అందజేశాడు. దీంతో మోహన్ బాబు మరో చిక్కుల్లో పడినట్టైంది. ప్రస్తుతం కేసుపై విచారణ జరిపిస్తున్నారు.
కాగా, సౌందర్య భర్త జీఎస్ రఘు తాజాగా ఈ ఘటనపై స్పందించారు. మోహన్ బాబు సౌందర్యను హత్య చేయించాడని, సౌందర్యకు మోహన్ బాబుకు ఆస్తి వివాదాలు ఉన్నాయని చిట్టిబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు నివసిస్తున్న హైదరాబాద్ లోని జట్ పల్లి ఇల్లు కూడా సౌందర్యదేనని కూడా ఆరోపించాడు. ఆ వివాదంపై తాజాగా రఘు మాట్లాడారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా సౌందర్య, మోహన్ బాబు పేర్లను ఆస్తి వివాదమంటూ తెరపైకి తీసుకొస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.

తనకు తెలిసినంత వరకు సౌందర్య, మోహన్ బాబుకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి తమ కుటుంబం కూడా మోహన్ బాబుతో కలిసి మెలిసే ఉందని కూడా చెప్పారు. అయితే మోహన్ బాబుతో తమకు ఆస్తి గొడవలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను వెంటనే ఆపేయాలని కోరారు. పరిస్థితి చేయి దాటిపోతున్నసందర్భంగా తానే స్వయంగా వచ్చి విషయంపై, తప్పుడు వార్తలపై క్లారిటీ ఇస్తున్నట్టు తెలిపారు. ఆస్తి వివాదాలు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇక సౌందర్య 20 ఏళ్ల కింద 2004లో హెలికాప్టర్ ఘటనలో మరణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











