ప్రకాష్ రాజ్ ప్రైవేట్ ఫోటో లీక్ .. దారుణంగా నెటిజన్ల కామెంట్స్

సోషల్ మీడియా రాకతో ఏది నిజమో , ఏది అబద్ధమో తెలియని పరిస్ధితులు నెలకొన్నాయి. దీనిపై బాధితులు రియాక్ట్ అయ్యే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వీటిని పలువురు పట్టించుకుని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా.. మరికొందరు మాత్రం చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు.

ఇక ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తోంది. మొన్నామధ్య నేషనల్ క్రష్ రష్మిక మందన్న , అలియా భట్, కాజోల్‌లను డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో టార్గెట్ చేసి పైశాచిక ఆనందం పొందారు కేటుగాళ్లు. అభ్యంతరకర స్థితిలో ఉన్న ఆయా తారల వీడియోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. చాలా మంది అదే నిజమని నమ్మారంటే పరిస్థితులు ఎలా తయారయ్యే అర్ధం చేసుకోవచ్చు.

south actor Prakash raj s fake photo viral related to maha kumbh mela 2025

తర్వాత బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను కూడా కేటుగాళ్లు వదల్లేదు. ఆయన కొడుకు కోడలైన అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ బచ్చన్‌లు విడాకులు తీసుకున్నట్లుగా అమితాబ్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి వదలడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ మాట్లాడిన వీడియోను ఏఐ టెక్నాలజీ సాయంతో ఎవరో మార్చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను పలు ఏజెన్సీలు, జాతీయ మీడియా సంస్థలు డీప్ ఫేక్‌గా వెల్లడించాయి.

ఇప్పుడు ఈ డీప్‌ఫేక్‌కి ఏఐ టెక్నాలజీ తోడు కావడంతో మరింత రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మార్ఫింగ్ ఫోటో బారినపడ్డారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్త జనం పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ తరిస్తున్నారు. భారతీయులతో పాటు విదేశీయులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు వస్తుండటం హాట్ టాపిక్‌గటా మారింది.

ప్రకాష్ రాజ్ కూడా కుంభమేళాలో పుణ్యస్నానం చేసినట్లుగా ఉన్న ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇది మంచి విషయమే కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. నాస్తికుడని చెప్పుకునే మీరు కుంభమేళాకి ఎందుకు వెళ్లారంటూ ట్రోలింగ్ చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రకాష్ రాజ్ ఎక్స్ ద్వారా స్పందించారు. అది ఫేక్ న్యూస్ అని .. ఇలా చేయడం సిగ్గు చేటని, దీనిపై ఫిర్యాదు చేశానన్న ప్రకాశ్.. దీనికి వెనుక ఎవరున్నా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సో.. అదన్న మాట అసలు మేటర్.

ప్రస్తుతం ప్రకాశ్ రాజ్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో రెట్రో, ఓజీ, గూఢచారి 2 వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. 2026కు కూడా ఆయన డైరీ ఖాళీగా లేదంటే ప్రకాశ్ రాజ్ ఎంత బిజీగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

More from Filmibeat

Read more about: prakash raj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X