Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెంగ్విన్ టీజర్ టాక్: తల్లి ప్రేమతోనే భయపెడుతున్న కీర్తి సురేష్.. ఆ సైకో ఎవరు?
కీర్తి సురేష్ మొదటిసారి ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాతో రాబోతోంది. పెంగ్విన్ అనే సినిమా టీజర్ ని కొద్దీ సేపటి క్రితమే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ టీజర్ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది. టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిని కలిగిస్తోంది. తప్పకుండా ఈ లాక్ డౌన్ లో సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
టాలెంటెడ్ టెక్నీషియన్స్..
సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాకు దర్శకత్వం వహించిన కార్తిక్ సుబ్బరాజ్ నిర్మించిన పెంగ్విన్ సినిమాకు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించాడు. సినిమాకు మొత్తం యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయడం విశేషం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ లో రిలీజ్ కాలేకపోతోంది. ఇక ఫైనల్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుంది.
టీజర్ టాక్..
టీజర్ విషయానికి వస్తే... పెంగ్విన్ అనే టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఇక నేటితరం మహానటి కీర్తి సురేష్ కొత్త తరహాలో కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కొడుకుపై ప్రేమను చూపిస్తూనే అతను తప్పిపోవడంతో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే విధంగా టీజర్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని చూపించారు. చివరగా కనిపించే ఆ సైకో ఎవరనే కాన్సెప్ట్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది.
మొత్తానికి..
మొత్తానికి పెంగ్విన్ టీజర్ తోనే చిత్ర యూనిట్ మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. దానికి తోడు స్టార్ హీరోయిన్స్ టీజర్ ని నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో సమంత, హిందీ నుంచి తాప్సి, తమిళ్ లో త్రిష, ఇక మళయాళంలో మంజు వారియర్ ఈ సినిమా టీజర్ ని మధ్యాహ్నం 12గంటలకు లాంచ్ చేశారు. దీంతో టీజర్ కి అన్ని భాషల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
Recommended Video
రిలీజ్ ఎప్పుడంటే..
చూస్తుంటే ఈ కరోనా టైమ్ లో పెంగ్విన్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. ఇక అమెజాన్ లోనే ఈ నెల 19న పెంగ్విన్ రిలీజ్ కానుంది. వీలైనంత వరకు థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి మరింత ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని మంచి డీలింగ్ తో నిర్మాతలు అమెజాన్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.