సీనియర్ నటి మీనా కూడా చివరకు అదే బాట పట్టారు!
ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం, చౌక ధరలకే కావాల్సినంత ఇంటర్నెట్ లభిస్తుండటంతో ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఎంటర్టెన్మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మంచి ఆదాయం ఉండటంతో పలువురు ఫిల్మ్ మేకర్స్, నటీనటులు వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఒకప్పటి సౌతిండియా స్టార్ హీరోయిన్, సినీయర్ నటి మీనా కూడా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు. త్వరలో ఆమె 'కరోలిన్ కామాక్షి' అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. జీ5లో ఇది ప్రసారం కాబోతోంది.

హీరోయిన్‌గా వెలుగొందుతున్న రోజుల్లో మీనా రకరకాలు పాత్రలు వేశారు. 'కరోలిన్ కామాక్షి'లో ఆమె సీబీఐ ఏజెంట్‌గా కనిపించబోతున్నారు. మోడల్ జార్జియా ఆండ్రియానీ సైతం ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. చిదంబరం నటేశన్ నిర్మాత.
హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత మీనా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో ఆమె చివరి సారిగా వెంకీతో కలిసి దృశ్యం , సాక్ష్యం మూవీలో హీరో తల్లి పాత్రలో నటించారు. మలయాళంలో చేసిన షైలాక్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











