కల్ట్ క్లాసిక్ ప్రేమదేశం సినిమాకు సీక్వెల్.. ఈసారి హీరోలు ఎవరంటే?
వెండి తెరపై ప్రేమ కథలు ఎన్ని వచ్చినా కూడా కొన్ని మాత్రం కలకాలం అలానే చరిత్రలో మిగిలి పోతాయి. వాటిని ఎవరూ కూడా అంత ఈజీగా మర్చిపోలేరు అని చెప్పవచ్చు. ఇక అలాంటి మంచి గుర్తింపు అందుకున్న కొన్ని సినిమాలలో ప్రేమ దేశం ఒకటి. తమిళ్ లో కాదల్ దేసం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో సంచలన విజయాన్ని అందుకుంది. 1996 లో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి దర్శకుడు కథిర్ అంటే ఎవరు అప్పటివరకు పెద్దగా తెలియదు.
ప్రముఖ నిర్మాత కె.కుంజుమొన్ అంటే కూడా అప్పట్లో అంతగా గుర్తంపు ఇచ్చేవారు కాదు. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత మాత్రం వారి టాలెంట్ ఏమిటో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఒక నిర్మాత దర్శకుడు అనే పదానికి వారు ఒక మంచి గౌరవాన్ని తెచ్చారు. ఇక మరోసారి సీక్వెల్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

సంగీతంతోనే భారీ క్రేజ్
ఒక సినిమా వెనుక దర్శకుడు నిర్మాత ఎంత కష్టపడతారో కాదల్ దేసం సినిమాతో చాలా క్లారిటీ గా అర్థమైంది. ఎందుకంటే అలాంటి ట్రయాంగిల్ లవ్ స్టొరీ అప్పట్లో అదే మొదటిసారి. ఏ దర్శకుడు కూడా అలాంటిది ట్రై చేయలేదు. నిర్మాత ఒప్పుకోవడం మరొక విశేషం. ప్రేమదేశం సినిమా కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా అదే స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ టాలెంట్ ఏమిటో కూడా అదే సినిమాతో చాలా క్లారిటీ గా అర్థమైంది. సినిమాలోని ప్రతి పాట కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది.

అప్పట్లో బడ్జెట్ ఎంతంటే..
ఒక విధంగా రాబోయే తరం ప్రేమ కథలను 20 ఏళ్లకు ముందే ఊహించడు ఆ చిత్ర దర్శకుడు. ఇక ఈ సినిమాతోనే ఇద్దరు హీరోలు వినీత అబ్బాస్ వెండితెరకు బాగా దగ్గరయ్యారు. అబ్బాస్ కు ఇదే మొదటి సినిమా. టబుకు కూడా కూడా ఇదే మొదటి తమిళ సినిమా. దాదాపు అందరూ కొత్త నటీనటుల అని చెప్పవచ్చు. కానీ కేవలం కథ బలాన్ని నమ్ముకొని చిత్ర నిర్మాత కోటి రూపాయలతో సినిమాను నిర్మించారు.

ఇన్నాళ్లకు సీక్వెల్..
ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి క్లైమాక్స్ ను అప్పట్లో వరకు ఎవరూ ఊహించలేదు కూడా. తమిళం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా చెప్పవచ్చు. అయితే 25 ఏళ్ల అనంతరం ఆ సినిమాకు సంబంధించిన సీక్వెల్పై దర్శకుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.

ఎందుకో వర్కౌట్ కాలేదు..
అసలైతే పదేళ్ళ క్రితమే సీక్వెల్ పై చర్చలు జరిపాడు కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక ప్రముఖ నిర్మాత తో కలిసి సీక్వెల్ పై చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కథిర్ ప్రేమదేశం సినిమాకు సంబంధించిన కథపై చర్చలు జరుగుతున్నామని ఇప్పటికే స్క్రిప్టు కూడా సిద్ధమైందని తెలిపారు.

కొత్త వారితోనే.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
వీలైనంత త్వరగా ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేస్తామని కూడా వివరణ ఇచ్చారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో నటించే హీరోలు హీరోయిన్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. అబ్బాస్ వినీత్ అలాగే హీరోయిన్ టబు కూడా ఈ సెన్సిటివ్ కథలో గొప్పగా నటించారు. ఇక అలాంటి కథకు నేటి తరం వారిలో ఎవరు సరితూగుతారో అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే దర్శకుడు మాత్రం ఈసారి కూడా పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశాడు. మరి ఆ లక్కు ఎవరిని వరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











