కల్కి మేకర్స్ పై కొరియన్ ఆర్టిస్ట్ కాపీ ఆరోపణలు... ప్రూఫ్స్ సహా బయట పెట్టేసింది!! -

ప్రభాస్ హీరోగా నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీకి రిలీజ్ కి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో జోరుగా ప్రచారం చేస్తున్న చిత్ర బృందానికి ఓ కొరియన్ షాక్ ఇచ్చారు. తన కష్టాన్ని కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియా వేదికగా కల్కి మేకర్స్ ని ఇరికించింది. ఇంతకీ ఆ కొరియన్ దగ్గర నుంచి కల్కి టీం ఏం కాపీ కొట్టింది అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే జూన్ 10న మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే మేకర్స్ చేసిన పెద్ద తప్పు ట్రైలర్ ను రిలీజ్ చేయడమే అన్నట్టుగా మారింది తాజాగా పరిస్థితి. ఎందుకంటే ట్రైలర్ మొదట్లో ఉన్న ఓ సన్నివేశానికి సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ కొరియన్ ఆర్టిస్ట్ కల్కి మేకర్స్ పై కాపీ ఆరోపణలు చేశారు.

South Korean artist Sung Choi alleges plagiarism against Kalki 2898 AD Makers

దక్షిణ కొరియాకు చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్ చోయ్. ఆయన గతంలో మార్వెల్, డిస్నీ, నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్ లతో పాటు మరెన్నో ప్రధాన కంపెనీల ప్రొడక్షన్‌లలో పని చేశాడు. తాజాగా సంగ్ చోయ్ సోషల్ మీడియా హ్యాండిల్ లో 10 సంవత్సరాల క్రితం తను పోస్ట్ చేసిన ఆర్ట్ ను కల్కి నిర్మాతలు దొంగిలించారు అంటూ ఆరోపించారు. అంతేకాదు అప్పట్లో తను షేర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో సహా ఇప్పుడు కల్కి మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఉన్న తన ఆర్ట్ ను స్క్రీన్ షాట్ తీసి మరీ నిరూపించారు. ఈ ఆర్టిస్ట్ సినిమాలో తన కలను అనధికారికంగా ఉపయోగించడం దుర్వినియోగం అంటూ స్ట్రాంగ్ గానే కౌంటర్ వేశారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సదరు కొరియన్ ఆర్టిస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో కల్కిని నిర్మించిన ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ ను డైరెక్ట్ గా ట్యాగ్ చేసి ఇలా కాపీ కొట్టడం ఏంటని ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకి వైజయంతి మూవీస్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో తెలియదు. కానీ మూవీ లవర్స్ మాత్రం ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.

South Korean artist Sung Choi alleges plagiarism against Kalki 2898 AD Makers

సంగ్ చోయ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టిన ఆ ఆర్ట్ ను క్రాస్ సైట్ ఆఫ్ ఏఆర్కె అని పిలుస్తారు. ఇది తన సొంత టాలెంట్ కు సంబంధించిన ఆర్ట్. అయితే ఆశ్చర్యకరంగా ట్రైలర్ ప్రారంభంలో శిథిలాలలో ఓ వింత ఆకారం పడిపోవడం కూడా అచ్చం అతని ఆర్ట్ ను పోలినట్టుగానే ఉంది. ఇది ఖచ్చితంగా కల్కి టీంకు నెగిటివ్ ఎఫెక్ట్ గా మారే అవకాశం ఉంది. కల్కిని పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయాలనుకుంటున్న మేకర్స్ కు ఈ కాపీ ఆరోపణలు పెద్ద దెబ్బ అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X