కోలుకొన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం.. నిలకడగా ఆరోగ్యం ఫ్యామిలీ ధృవీకరణ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి కుదటపడినట్టు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం బాల సుబ్రమణ్యం ఆరోగ్యం విషమించడంతో ఐసీయూ నుంచి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించిన విషయం తెలిసిందే. బాలు ఆరోగ్య విషయం తీవ్రతరం కావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
బాలసుబ్రమణ్యం సోదరి ఎస్పీ వసంత మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలా సుబ్రహణ్యం ఆరోగ్యం కుదుటపడింది. ఎవరు కంగారు పడొద్దు. అనారోగ్యం నుంచి బయటపడే ఆత్మస్థైర్యం ఆయనకు ఉంది. మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ ఉంది. ఇప్పుడు బాగానే ఉన్నారు. మీ ప్రార్థనలు ఫలించి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు అని తెలిపారు.

ఎస్పీబీ ఆరోగ్యం విషమించిందనే విషయం తెలుసుకొన్న పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. చిరంజీవి, ఇళయరాజా తమ ప్రకటనలు మీడియాకు రిలీజ్ చేశారు. తన సోదరుడు బాలు త్వరగా కోలుకోవాలని చిరంజీవి ప్రార్థించారు. ఇళయ రాజా తన మిత్రుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన కోవిడ్ 19 పాజిటివ్‌తో హాస్పిటల్‌లో చేరారు. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఫర్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్ హస్పిటల్‌లో చేరారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.


Click it and Unblock the Notifications











