త్వరలో మంచి వార్త.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై కుమారుడి ప్రకటన
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడటం అభిమానులకు, సన్నిహితులు, స్నేహితులకు ఊరట కలిగిస్తున్నది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం నుంచి సాధారణ స్థాయికి వచ్చినట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సానుకూలమైన వార్తను మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ చరణ్ లేటేస్ట్ వీడియోలో మాట్లాడుతూ.. నాన్నగారి ఆరోగ్యం వరుసగా నాలుగో రోజు కూడా నిలకడగా ఉంది. ఈ వారాంతానికి మంచి వార్త వైద్యులు చెప్పే అవకాశం ఉంది. దేవుడి దీవెనలు, మీ అందరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ప్రార్థన వల్ల ఆయన త్వరగా కోలుకొన్నారు. సోమవారం నాటికి మీకు మంచి శుభవార్త వింటారు. ఆ రోజు కోసం వేచి చూస్తున్నాం అని అన్నారు. గత కొద్ది రోజులుగా ఫిజియోథెరపీ చికిత్సను అందిస్తున్నట్టు సమాచారం.

కరోనావైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారడంతో ఆందోళన వ్యక్తమైంది. ఆగస్టు 13వ తేదీ రాత్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమించడంతో రజనీకాంత్, చిరంజీవి, ఏఆర్ రెహ్మాన్, కమల్ హాసన్‌తో సహా పలువురు సినీ హీరోలు, ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.


Click it and Unblock the Notifications











