ఎస్పీ బాలు ఆరోగ్యంపై వదంతులు.. దేవుడే నిర్ణయిస్తాడు అంటూ ఎస్పీ చరణ్ వీడియో రిలీజ్

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వదంతులు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. గత కొద్దికాలంగా బాలు కోలుకొంటున్నారనే వార్తల మధ్య ఆయన ఆరోగ్యంపై వచ్చిన రూమర్లను కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వీడియో రిలీజ్ చేసి తన తండ్రి ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు. చరణ్ రిలీజ్ చేసిన వీడియో ప్రకారం..

ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటూ

ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటూ

చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం డిశ్చార్జి అవుతున్నారంటూ.. ఆయనకు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతున్నది అంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి భిన్న రకాల వార్తలతో మాకు వందలాది ఫోన్లు వస్తున్నాయి. వాటికి సమాధానం ఇచ్చే పరిస్థితి మాకు లేదు అని ఎస్పీ చరణ్ తెలిపారు.

రూమర్లతో ఫ్యామిలీపై ఒత్తిడి

రూమర్లతో ఫ్యామిలీపై ఒత్తిడి

మీడియాలో వస్తున్న వార్తలు, రూమర్ల వల్ల ఫ్యామిలీపై ఒత్తిడి పెరుగుతున్నది. మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి. నేను రిలీజ్ చేసే వీడియోను గానీ, మా పీఆర్వో నిఖిల్ మురుగన్ వెల్లడించే సమాచారమే నమ్మండి. దాదాపు రెండు రోజుల్లో ఒకసారి వీడియోను పోస్టు చేస్తున్నా. ఏదైనా విషయం తెలియజేయాలనుకొంటే స్వయంగా నేను వెల్లడిస్తాను అని ఎస్పీ చరణ్ చెప్పారు.

నాన్న అపస్మారక స్థితిలో లేరు

నాన్న అపస్మారక స్థితిలో లేరు

ఐసీయూలో నాన్న పాటలు పాడుతున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, నెమ్మదిగా కోలుకొంటున్నారు. అయితే ఆయన మత్తు ఇంజెక్షన్ల కారణంగా అపస్మారక స్థితిలో లేరు. నాన్నకు చికిత్స చాలా స్మూత్‌గా సాగుతున్నది. ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని ఎస్పీ చరణ్ వెల్లడించారు.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
త్వరలోనే డిశ్చార్జి అవుతారు..

త్వరలోనే డిశ్చార్జి అవుతారు..

ఎస్పీ బాలుకు ఇన్‌ఫెక్షన్ సోకినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుందన్న వార్తల్లో వాస్తవం లేదు మీడియా రూమర్లను నమ్మకండి. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నది. నాన్న త్వరలోనే కోలుకొని డిశ్చార్జి అవుతారు. అయితే ఆయన ఎప్పుడు డిశ్చార్జి అవుతారనే విషయం దేవుడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది అంటూ ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X