twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్.. హాస్పిటల్‌లోనే వివాహ వార్షికోత్సవం.. క్రికెట్, టెన్నిస్ చూస్తూ

    |

    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పరిస్థితి మరింత కుదుట పడింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఎస్పీ బాలుకు కరోనావైరస్ నెగిటివ్ అని తేలింది. ఈ సంతోషకరమైన వార్తను ఎస్సీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తమ అభిమానులు, సన్నిహితులు, స్నేహితులతో పంచుకొన్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎస్పీ చరణ్ వెల్లడిస్తూ..

    Recommended Video

    నాన్న IPL 2020 కోసం వెయిట్ చేస్తున్నారు | SP Charan on SP Balasubrahmanyam's Health
    ఎస్పీ చరణ్ తాజా వీడియోలో

    ఎస్పీ చరణ్ తాజా వీడియోలో

    తాజాగా విడుదల చేసిన వీడియోలో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. నాన్నకు కరోనావైరస్ నెగిటివ్ అని తేలింది. అయితే ఆయనకు ఇంకా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. త్వరలోనే నాన్న ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అయితే అతడి ఆరోగ్య పరిస్థితుల రీత్యా వెంటిలెటర్‌పై ఉంచి వైద్యాన్ని అందించడమే ఉత్తమమని వైద్యులు భావిస్తున్నారు.

    వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్నారు..

    వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్నారు..

    ఇలాంటి పరిస్థితుల్లో నాన్నకు చిన్న ఊరటను, ఉత్సాహాన్ని కలిగించేందుకు అమ్మ, నాన్నల వివాహ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించాం. హాస్పిటల్ బెడ్‌పై నుంచే ఐపాటడ్‌లో క్రికెట్, టెన్నిస్ ఆటలను వీక్షిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. చేతితో రాస్తూ కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేస్తున్నారు అని ఎస్‌పీ చరణ్ తెలిపారు.

    ఆరోగ్యం మెరుగుపడటంతో బులెటిన్ నిలిపివేత

    ఆరోగ్యం మెరుగుపడటంతో బులెటిన్ నిలిపివేత

    నాన్న ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగుపడుతున్నందున్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందునే బులెటిన్ ఆపివేశారు అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీన కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులతోపాటు రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, ఏఆర్ రెహ్మాన్ లాంటి ప్రముఖులందరూ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

    16 భాషల్లో 40 వేల పాటలు పాడి

    16 భాషల్లో 40 వేల పాటలు పాడి

    భారతీయ సంగీత ప్రపంచంలో దిగ్గజ గాయకుడైన ఎస్పీ బాలసుబ్రమణ్యం తన కెరీర్‌లో 16 భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడారు. గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డులతోపాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకొన్నారు. ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీతకారులతో కలిసి ఆయన పనిచేశారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

    English summary
    Popular SP Balasubrahmanyam tested coronavirus negative. His son released a video and revealed his health update. He says, We were expecting dad's lungs to improve as they were but unfortunately we are still not at that point where we could rid him of the ventilator. But the good news is that dad is COVID negative.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X