ఎస్పీ బాలసుబ్రమణ్యం సతీమణి సావిత్రమ్మకు కరోనా పాజిటివ్

కరోనా వ్యాధితో బాధపడుతూ చెన్నై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకొంటున్నారనే వార్త అభిమానులను సంతోషానికి గురి చేయగా.. ఆయన భార్య సావిత్రమ్మకు కరోనాపాజిటివ్ అనే వార్త షాక్‌కు గురి చేస్తున్నది. ఆగస్టు 5వ తేదీన బాల సుబ్రమణ్యంకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎస్పీబీ సతీమణి సావిత్రమ్మకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

దాంతో ఎస్పీబీ భార్య సావిత్రమ్మను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం బాలు, సావిత్రి ఆరోగ్యం నిలకడగా ఉంది. వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుమారుడు చరణ్ తమిళ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మా నాన్న (ఎస్పీబీ) ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఫర్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్‌ హస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా తాను కోలుకొంటున్నారు. నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయన చాలా మనోధైర్యంతో ఉండటం మాకు ఊరట కలిగించింది. అభిమానులెవ్వరూ ఆందోళనకు గురికావొద్దు అని చెప్పారు. తమిళ టెలివిజన్ ఛానల్‌లో వస్తున్న రూమర్లను దయచేసి నమ్మవద్దు అని బాలు కుమారుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు.

SP Balasubrahmanyam wife Savitri tested corona Positive

ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఆయన సతీమణి సావిత్రమ్మకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తెలుగు, తమిళ సీనీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఎస్పీ బాలు, ఆయన సతీమణి సావిత్రి మేడమ్ కోవిడ్ 19 వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలి అని ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్. రెహమాన్, గాయని చిత్ర, చిరంజీవి తదితరులు ప్రార్థిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X