twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లు ఎన్ని కోట్లంటే.. క్లారిటీ ఇచ్చిన చరణ్

    |

    గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించిన రెండు రోజులకే రూమర్స్ వైరల్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం. ఇక ఆ విషయాలపై ఎస్పీ చరణ్ వెను వెంటనే క్లారిటీ ఇవ్వడం కూడా చింతించాల్సిన విషయమని చాలా మంది చెబుతున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎస్పీ చరణ్ కొన్ని మీడియాలలో వస్తున్న వదంతులపై అసలు క్లారిటీ ఇచ్చారు. అలాగే తండ్రి యొక్క స్మారక చిహ్నంపై కూడా చరణ్ వివరణ ఇచ్చారు.

    బిల్లు కోట్ల రూపాయల్లో ఉంటుందని..

    బిల్లు కోట్ల రూపాయల్లో ఉంటుందని..

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ భారిన పడ్డప్పటి నుంచి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లోనే 50రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ హాస్పిటల్ బిల్లు కోట్ల రూపాయల్లో ఉంటుందని బాలసుబ్రహ్మణ్యం మరణించిన తరువాత బిల్లు కట్టేంత వరకు కూడా పార్థివదేహాన్ని ఇవ్వలేదనే రూమర్స్ కూడా వచ్చాయి. ఆ రూమర్స్ నిజం కావని చరణ్ ప్రెస్ మీట్ లో కొట్టి పారేశారు. హాస్పిటల్ యాజమాన్యంతో జరిగిన సంభాషణపై కూడా మాట్లాడారు.

    పూర్తిగా బిల్స్ క్లియర్ చేయాలని అనుకున్నప్పుడు..

    పూర్తిగా బిల్స్ క్లియర్ చేయాలని అనుకున్నప్పుడు..

    ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. నాన్న గారు హాస్పిటల్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఒక్కో వారం ఒక్కో బిల్ చెల్లిస్తూ వచ్చాము. ఇక నాన్నగారి చివరి రోజుల్లో బిల్ కట్టాలని వెళ్లినప్పుడు ఇప్పుడు అవసరం లేదని, మేమే మళ్ళీ చెబుతామని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. ఇక ఫైనల్ గా శుక్రవారం నాన్న గారు మరణించిన రోజు కూడా పూర్తిగా బిల్స్ క్లియర్ చేయాలని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు మాకు ఇక ఎలాంటి బిల్స్ చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.

    మూడు కోట్లు, కోటి 80లక్షలు.. అంతా అబద్ధం

    మూడు కోట్లు, కోటి 80లక్షలు.. అంతా అబద్ధం

    ఇక మిమ్మల్ని ఎలాంటి పేమెంట్స్ గురించి అడగదలచుకోవడం లేదండీ అని హాస్పిటల్ వాళ్ళు చాలా క్లియర్ గా నాకు వివరణ ఇచ్చారు. అప్పుడే బిల్లింగ్ వ్యవహారం ముగిసింది. ఇది జరిగింది. కానీ మూడు కోట్లు, కోటి 80లక్షలు చెల్లించాలనే రూమర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. అలాగే వైస్ ప్రెజిడెంట్, వారి కూతురు ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఎందుకు కల్పిత కథలు వచ్చాయో నాకు తెలియదు.

    ఇలాంటి సమయంలో నిజంగా బాధాకరం.

    ఇలాంటి సమయంలో నిజంగా బాధాకరం.

    ఇప్పటివరకు మా అందరి రిలేషన్ అనేది చాలా బావుంది. ఇలాంటి రూమర్స్ రావడం చాలా బాధాకరం. నాన్నగారి హాస్పిటల్ బిల్స్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి అలాంటి వాటికి ప్రచారాలు కల్పించవద్దు. ఇక నాన్నగారిని కడసారి చూసేందుకు కూడా ఎంతో అభిమానులకు అవకాశం దక్కలేదు. ఇలాంటి సమయంలో నిజంగా అది బాధాకరం.

    Recommended Video

    #SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB
    నాన్నగారు లేనప్పుడు భారత రత్న ఎందుకు..

    నాన్నగారు లేనప్పుడు భారత రత్న ఎందుకు..

    ఇక నాన్నగారి సమాధి వద్ద ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఆ విషయంపై మా కుటుంబ సభ్యులందరం ఒక నిర్ణయానికి వస్తాము. అప్పుడు అభిమానులు నాన్న గారి దగ్గరికి వచ్చి స్మరించుకునే అవకాశం ఉంటుంది. విగ్రహం కూడా ఏర్పాటు చేస్తే మంచిదే. ఇక్కడి ప్రభుత్వంతో కూడా మరోసారి మాట్లాడి చెబుతాను. ఇక నాన్న గారే లేనప్పుడు భారత రత్న వస్తే ఏంటి రాకపోతే ఏమిటి?. భారత రత్న వస్తే ఒక విదంగా సంతోషమే కానీ అంత కంటే గొప్ప భారత రత్న బాలు గారే.. అని ఎస్పీ చరణ్ మీడియా అడిగిన ప్రశ్నలకు చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు.

    English summary
    Vice President Sri Venkaiah Naidu daughter Deepa Venkat given clarity on SP Balasubrahmanyam's MGM Hospital bills. She said that, Its very sad that some Whatsup message which is factually wrong regarding myself is being forwarded with regard to payment of medical bills of Late Shri S.P. Balasubramanyam sir to the hosp
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X