ఎస్పీ బాలు ఇకలేరు: తండ్రి మరణవార్తను స్వయంగా మీడియాకు వెల్లడించిన ఎస్పీ చరణ్

గత 50 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఎస్పీ బాలు గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో హెల్త్ అప్‌డేట్‌ ఇచ్చేవారు. తాజాగా తన తండ్రి మరణవార్తను మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఈ లోకాన్ని వీడారని చెప్పడంతో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఎస్పీ చరణ్ స్నేహితుడు సినీ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా ట్విట్టర్‌లో ధృవీకరించారు.

మా నాన్నపై ప్రేమానురాగాలు కురిపించిన అభిమానులకు మా కుటుంబ కృతజ్ఞులం. మీరు ఉన్నంత కాలం మా నాన్న, ఆయన పాట ఉంటుంది. మా నాన్న ఉన్నంత కాలం మీరు మాతో ఉన్నారు. ఇక ముందు కూడా మీరు మాపై ప్రేమను కురిపించాలి. ఎన్నో దశాబ్దాలపాటు మాతో ప్రయాణం సాగించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞులం అని క్లుప్తంగా ఎస్పీ చరణ్ మీడియాతో మాట్లాడారు.

SP Charan briefed father SP Balasubrahmanyam death news

కరోనావైరస్ పాజిటివ్ బారిన పడిన ఎస్పీ బాలు ఆగస్టు 5వ తేదీన నుంచి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే సుదీర్గ కాలంగా ఆయనను వెంటిలేటర్‌పై పెట్టి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గత కొద్దికాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సంతోషంగా ఫీలయ్యారు. అంతలోనే ఆయన ఆరోగ్యం గత రెండు రోజులుగా క్షిణించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X