అవన్నీ రూమర్లే ఇంకా వెంటిలేటర్‌పై ఉన్నారు.. ఎస్పీ చరణ్ ప్రకటన

ప్రస్తుతం సినీ ప్రేమికులు, సంగీత ప్రియులంతా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఎస్పీబీకి కరోనా సోకడం అది కాస్తా విషమించడంతో ఐసీయూ, వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బాలు ఆరోగ్యం గురించి యావత్ దేశమంతా కంగారు పడుతోంది. ఏఆర్ రెహ్మాన్, శంకర్ మహదేవన్, చిత్ర, అనిరుధ్ వంటి వారంతా ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మీడియాలో ఎస్పీబీ ఆరోగ్యంపై వస్తోన్న రూమర్లను కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.

కాసేపటి క్రితమే ఎస్పీ శైలజ ఓ అప్ డేట్ ఇచ్చారు. అందులో అన్నయ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతోందిది. వెంటిలేటర్ తీసివేశారు. మునపటి కంటే ఇప్పుడు ఆరోగ్యం మరింత మెరుగుపడింది. అంటూ చెప్పుకొచ్చారు. ఇక మళ్లీ ఎస్పీ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు. వెంటిలేటర్‌పై నుంచి తీసేశారని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని కొట్టిపారేశారు.

 Sp Charan Says That SP Balasubrahmanyam Is Still On Ventilator

'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని వెంటిలేటర్‌పై నుంచి తీశారని వస్తోన్న వార్తలు అవాస్తవమని ఎస్పీ చరణ్ తెలిపాడు. అలాంటి ఓ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. మా నాన్న గారి పరిస్థితి నిన్నటిలానే ఉంది. దయచేసి రూమర్లను రాయకండ'ని విన్నవించుకున్నాడు. ఇక ఎస్పీబీ ఆరోగ్యం కుదుపపడాలని నేడు సాయంత్రం ఆరుగంటలకు సామూహిక ప్రార్థనలు చేయాలని ఆర్పీ పట్నాయక్ కోరాడు. ఈ మేరకు చంద్రబోస్ కూడా ఈ విషయమై స్పందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X