నాన్న ఆరోగ్యం విషమంగానే.. కంటతడి పెట్టిన ఎస్పీ చరణ్

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందనే వార్తలు అభిమానులను, కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తన ఫేస్‌బుక్‌లో రిలీజ్ చేసిన ఓ వీడియోలో తన తండ్రి ఆరోగ్యం గురించి వివరిస్తూ కంటతడి పెట్టుకొన్నారు.

నా తండ్రి ఆరోగ్యం విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికీ.. అభిమానుల కోసం ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు, స్నేహితులు చేస్తున్న ప్రార్థన కారణంగా ఆయనకు సంపూర్థ ఆరోగ్యం చేకూరుతుందనే ఆశలు, విశ్వాసం ఇంకా పెరుగుతున్నాయి. మీ ప్రార్థనలు మాలో విశ్వాసాన్ని కలుగు చేస్తున్నాయి అని ఎస్పీ చరణ్ ఆవేదనను వ్యక్తం చేశారు.

SP Charan shared a video about sp balasubrahmanyam health condition

నా తండ్రి కోసం గురువారం (ఆగస్టు 20) సాయంత్రం 6 గంటలకు సినీ పరిశ్రమ, మ్యూజిక్ ఇండస్ట్రీ ప్రార్థనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రార్థనల వల్ల మా తండ్రి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. ఆయన ఆరోగ్యం గురించి సామూహిక ప్రార్థనలు చేస్తున్నందుకు ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అంటూ చరణ్ కంటతడి పెట్టారు.

గురువారం సాయంత్రం తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సామూహిక ప్రార్థనలు చేపట్టనున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఏఆర్ రెహ్మన్, ఇతర ప్రముఖులు బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రార్థనలో పాల్గొనాలని భారతీరాజా, వైరముత్తు, జీవీ ప్రకాశ్, కార్తీ, ఏఆర్ మురుగదాస్ పిలుపునిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X