twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంటిలేటర్‌పైనే ఎస్పీ బాలుకి చికిత్స.. అయితే నిలకడగా ఆరోగ్యం.. చరణ్ ట్వీట్

    |

    ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాజా సమాచారాన్ని అందించారు. ఆయనకు ప్రస్తుతం ఫిజియోథెరపీ జరుగుతున్నది. ఆయన శరీర కదలికలు సంతృప్తికరంగా ఉన్నాయి అని ఆయన వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ వైద్యులకు థ్యాంక్స్ చెప్పారు.

    ఎస్పీబాలు ఆరోగ్యం గురించి ట్వీట్ చేస్తూ.. నాన్నగారి ఆరోగ్యం బాగుంది. ఫిజియోథెరపీ కొనసాగుతున్నది. ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నది. ఇంకా ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చు. నాన్నగారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు. అలాగే ఎన్నోరోజులు మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు అని ఎస్పీ చరణ్ ట్వీట్‌లో తెలిపారు. ఇప్పటి వరకు వీడియో రిలీజ్ చేసి అప్‌డేట్ చేసిన ఎస్పీ చరణ్ తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు.

    SP Charan tweets: SPB is still on ECMO and ventilator support

    ఆగస్టు 5వ తేదీన కరోనావైరస్ బారిన పడినట్టు ఎస్సీబాలు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనంతరం చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆగస్గు 13వ తేదీన ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలెటర్‌పై పెట్టి చికిత్సను కొనసాగించారు. అప్పటి నుంచి ఆయన హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు.

    కొద్ది రోజుల క్రితం మత్తు ఇంజెక్షన్లు ఇవ్వకుండానే చికిత్స అందిస్తున్నారు. రోజులో కనీసం 20 నిమిషాలపాటు కూర్చోగలుగుతున్నారు. ఆరోగ్యం కుదుట పడుతున్నది. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఎస్పీ చరణ్ సంకేతాలిస్తున్నారు.

    English summary
    SPB helath: SP Charan shared a video about sp balasubrahmanyam health condition: Son Charan confirms. Earlier Hospital sources released that, Legendary singer SP Balasubrahmanyam who was tested coronavirus positive. But SPB is still on ECMO and ventilator support.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X