ప్రభాస్ కోసం ప్రత్యేకంగా విమానం బుక్ చేస్తున్న నిర్మాతలు

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ వారు నిర్మించిన భారీ చిత్రం 'సాహో'. ఇటు బడ్జెట్ పరంగా, అటు టెక్నికల్ అంశాల పరంగా ఇండియాలో రూపొందిన టాప్ 5 బిగ్గెస్ట్ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఆగస్టు 30న సినిమా విడుదలవుతుండటంతో ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి.

'సాహో' తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదలవుతోంది. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దేశంలోని ప్రధాన నగరాలను ప్రభాస్ అండ్ మూవీ టీమ్ సందర్శించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

Special flight for Saaho movie promotions

వరుసగా వివిధ నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అండ్ టీమ్ కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు అందరూ మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.

సాహోలో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ తదితరులు నటిస్తున్నారు. సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపొందించారు కాబట్టి అన్ని భాషల నుంచి నటీ నటులను ఇందులో భాగం చేశారు.

రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'సాహో' హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రేక్షకులకు వినోదం పంచాలనే ఉద్దేశ్యంతో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను ఇందులో భాగం చేశారు. బాహుబలి 2 తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X