నిహారిక వెడ్డింగ్: ఆ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే.. జబర్దస్త్ కమెడియన్ కూడా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సారి పెళ్లి వేడుకలు మాత్రమే చాలానే జరిగాయి. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే హైదరాబాద్ లోనే పెళ్లిళ్లు చాలా గ్రాండ్ గా జరిగేవని చెప్పవచ్చు. నిజానికి సీని తారలు కూడా ఈ వేడుకను చాలా మిస్ అవుతున్నారు. ఇక పెళ్లిని ఉదయ్ పూర్ లో చేస్తున్న మెగా ఫ్యామిలీ కొంతమంది ప్రత్యేక అతిధులును స్పెషల్ గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట

మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట

మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి చాలా కాలమయ్యింది. నాగబాబు గారాల కూతురు నిహారిక కొణిదెల, చైతన్య వివాహ మహోత్సవ వేడుకలు ఉదయ్ పూర్ లో మూడు రోజుల ముందు నుంచే మొదలయ్యాయి. ఇక నేడు హిందు సాంప్రదాయం ప్రకారం నిహారిక మెడలో మూడు ముళ్ళు వేయానున్నాడు చైతన్య. అయితే వేడుకకు కొందరు స్టార్ సెలబ్రెటీలు హాజరు కానున్నట్లు టాక్ వస్తోంది.

పెళ్లిలో అందరి ఫోకస్ అతనిపైనే..

పెళ్లిలో అందరి ఫోకస్ అతనిపైనే..

సోమవారం రోజున మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలందరు ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, ఆధ్య, అకిరాలతో మంగళవారం వేడుకలో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ పై ఆడియెన్స్ ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది.

ఆ హీరోయిన్స్ మాత్రమే.. ఎందుకంటే

ఆ హీరోయిన్స్ మాత్రమే.. ఎందుకంటే

ఇక మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ తో సాన్నిహిత్యం ఉండగా పెద్దగా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. కానీ ఒకరోజు ముందుగానే ఈ వేడుకకు లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ వచ్చారు. వారిద్దరిని స్పెషల్ గా పిలవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ హీరోయిన్స్ ఇద్దరు నిహారిక జిమ్ మెంట్స్. జిమ్ లో ఈ ముగ్గురు కలిసే వర్కౌట్స్ చేస్తారు. చాలా తక్కువ సమయంలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలతో పాటే రెండు రోజుల ముందే వచ్చారు. ఇక రీతూ వర్మ, లావణ్య త్రిపాఠికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య అయితే అల్లు అర్జున్ తో సెల్ఫీ కూడా దిగింది.

Recommended Video

Niharika Konidela wedding : All Mega Heroes In one Frame
పెళ్లిలో జబర్దస్త్ కమెడియన్

పెళ్లిలో జబర్దస్త్ కమెడియన్

అయితే వేడుకకు ఒక జబర్దస్త్ కమెడియన్ కూడా వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. అతను మరెవరో కాదు గెటప్ శ్రీను అని. నాగబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీనును ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే గెటప్ శ్రీను ఇటీవల నిహారిక పెళ్లి కుతురీ ఫంక్షన్ కి వచ్చిన మాట వాస్తవమే. ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ ఆ రోజే మళ్ళీ హైదరాబాద్ కు వచ్చేశాడట. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ లో ఉన్నట్లు శ్రీను ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా చేశాడు. అంటే పెళ్లిలో శ్రీను లేడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X