మహేష్ స్పెషల్ పోస్టర్ రెడీ.. ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా.. అనిల్ రావిపూడి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూకుడుమీదున్నాడు. రీసెంట్‌గా మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సామాజిక సందేశంతో కూడుకున్నఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా ఇలాంటి సోషల్ మెసెజ్ సినిమాలే వస్తుండటంతో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఉండేట్టు జాగ్రత్త తీసుకుంటున్నాడు మహేష్.

ఇందుకోసం అనిల్ రావిపూడి సెట్స్ పైకి వచ్చేశాడు. గత చిత్రం ఎఫ్2 ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. వెండితెరపై నవ్వుల హరివిల్లు కురిపించడంతో దిట్ట ఈ డైరెక్టర్. ఈయన స్టైల్ లోనే ఈ సారి మహేష్ ఇమేజ్ కు సరిపోయే అద్భుతమైన కథను సిద్దం చేశాడు అనిల్.

 Special Poster From Mahesh Babus SariLeru Neekevvaru

సరిలేరు నీకెవ్వరు అంటూ టైటిల్ తోనే హైప్ క్రియేట్ చేసిన అనిల్.. ఫస్ట్ లుక్, టైటిల్ సాంగ్‌తో అదరగొట్టేశాడు. శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేస్తున్న చిత్రయూనిట్.. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే దసరా కానుకగా మహేష్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం 5.04గంటలకు స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

ఈ మేరకు.. అయితే మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా అంటూ ఫ్యాన్స్ నుద్దేశించి అనడంతో అంతా సంబరాల్లో మునిగిపోయారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మహేష్ బాబు ప్రస్తుతం దసరా సెలవులను ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి తనకు ఇష్టమైన ప్రదేశమైన స్విస్ ఆల్ప్స్ అనే ప్రదేశానికి వెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X