‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియో: అలా సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మహేశ్ బాబు
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో జయాపజయాలను చూసిన అతడు.. ఇటీవలి కాలంలో వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.
మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. ఆ వెంటనే రెండో దాన్ని కూడా తాజాగా మొదలు పెట్టారు. ఇది ఫిబ్రవరి 21 వరకూ కొనసాగనుంది. దీని కోసమే మహేశ్ బాబు అక్కడే ఉండిపోగా.. కీర్తి సురేష్ రెండు రోజుల క్రితమే దుబాయ్ చేరుకుంది. ఈ షెడ్యూల్ కూడా ముగిసిన వెంటనే చిత్ర యూనిట్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీని దీన్ని వదలబోతున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ వీడియోలో 'సర్కారు వారి పాట' సినిమా గురించి మహేశ్ బాబు ప్రత్యేకమైన బైట్ ఇవ్వబోతున్నాడట. అలాగే, షూటింగ్ స్పాట్ మేకింగ్‌ను కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతికి ఇది విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











