Spider-Man: Brand New Day Censor Report: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సెన్సార్ రిపోర్ట్.. 5 నిమిషాలు కట్
అమెరికన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మరో స్పైడర్ మ్యాన్ చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day). ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్ా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: బ్రెట్ పావ్లాక్, ఎఢిటింగ్: నాట్ సాండర్స్, జినా సన్సామ్, మ్యూజిక్: మైఖేల్ జియాచినో తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని భాగస్వామ్యంలో ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించిన సెన్సార్ రిపోర్ట్ వివరాల్లోకి వెళితే..

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జారీ చేసినట్టు ప్రచారం జరిగిన విషయంలో అనేక ఊహాగానాలు చోటు చేసుకొన్నాయి. ఈ సినిమా హాలీవుడ్ వెర్షన్‌కు ఇండియన్ వెర్షన్‌కు తేడా ఉంది. ఈ సినిమా ఇండియా వెర్షన్ నిడివిని దాదాపు తగ్గించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించింది. దాంతో రన్ టైమ్ విషయంలో తేడా వచ్చింది అనే విషయం సోషల్ మీడియాలో నెటిజన్లు, స్పైడర్ మ్యాన్ అభిమానుల మధ్య చర్చ జరిగింది.
ఈ చిత్రం రన్ టైమ్ విషయంలో దాదాపు 5 నిమిషాల నిడివిని తగ్గించారు అనే కామెంట్స్‌పై సోని పిక్చర్స్ స్పందించింది. మా సినిమాపై చూపిస్తున్న ఆదరణకు, ప్రేమకు ధన్యవాదాలు. ఇంకా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇండియాలో పూర్తి కాలేదు. సర్టిఫికెట్ కోసం వేచి చూస్తున్నామని కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. దాంతో అభిమానుల ఆందోళనకు కొంత చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
అయితే ఇండియాలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న తర్వాత స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు అంటే.. 145 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. అయితే హాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే వెర్షన్ రన్ టైమ్ 150 నిమిషాలు అంటే 2 గంటల 30 నిమిషాలు. దాంతో 5 నిమిషాలు తగ్గిందనే విషయంపై క్లారిటీ వచ్చింది. అయితే ఇంగ్లీష్ వెర్షన్‌తో పోల్చితే టైటిల్ క్రెడిట్స్, ఇంటర్వెల్ టైమింగ్ తదితర విషయాల వల్ల 5 నిమిషాలు తేడా వచ్చింది అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications