Prakash Raj: స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్‌ ఔట్.. రూమర్స్‌పై నటుడి రియాక్షన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ స్పిరిట్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్క్రిప్ట్ సహా అన్ని రకాల పనులు పూర్తి చేసుకుని గత రెండేళ్లుగా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు సందీప్. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో న్యూ ఇయర్ కానుకగా స్పిరిట్ పోస్టర్ రిలీజ్ చేశారు సందీప్ రెడ్డి వంగా. పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు.

ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ భాగమైనట్లుగా ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నట్లుగా తెలిపారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారని కొందరు, ప్రకాష్‌రాజ్‌నే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలకు ప్రకాష్ రాజ్ స్పందించారు. దీనిపై ఆయన తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Spirit Prakash Raj Reacts to Rumours About His Exit from Prabhas and Sandeep Reddy Vanga Movie

స్పిరిట్ తారాగణం
భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్సన్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగాలు స్పిరిట్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, అలనాటి నటి కాంచనలు కీలకపాత్ర పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, సుప్రీం సుందర్ యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2027 మార్చి 5న స్పిరిట్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, జపనీస్, కొరియన్, మాండ్రిన్ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

స్పిరిట్‌పై ఊహాగానాలు
స్పిరిట్ మూవీపై హైప్ మరింత పెంచేలా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలకపాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ 15 నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారని గాసిప్స్ వినిపించాయి. ఆ తర్వాత స్పిరిట్‌లో ప్రభాస్‌ను ఢీకొనే పవర్‌ఫుల్ విలన్ ఎవరన్న దానిపైనా గాసిప్స్ వచ్చాయి. బాలీవుడ్ టాప్ స్టార్ ఒకరు ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ మూవీలో విలన్ పాత్ర పోషించనున్నారని ఊహాగానాలు వినిపించాయి.

ప్రకాష్ రాజ్ రియాక్షన్
అయితే ఈసారి ఏకంగా ప్రకాష్ రాజ్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ షాకైంది. దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ విలక్షణ నటుడిని మేకర్స్ తప్పించారని, కాదు కాదు ప్రకాష్ రాజే తప్పుకున్నారని సోషల్ మీడియా రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో ఈ రూమర్స్‌పై ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. స్పిరిట్ మూవీ నుంచి నేను తప్పుకున్నట్లుగా కొందరు విష ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి నేను చెప్పేదేంటీ అంటే.. అసలు స్పిరిట్‌లో నా సీన్స్‌కు సంబంధించి అసలు షూటింగే మొదలు కాలేదు. కానీ ఇలోగా వాట్సాప్ ఫ్యాక్టరీలో రకరకాల కథలు అల్లేస్తున్నారు. ఎదగండి అంటూ ప్రకాష్‌ రాజ్ చురకలంటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. స్పిరిట్‌లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని, ఆయనను తప్పించలేదన్న ఊహాగానాలపై క్లారిటీ వచ్చింది.

More from Filmibeat

Read more about: spirit prakash raj prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X