Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా ట్రీట్.. స్పిరిట్ రిలీజ్ డేట్ అఫీషియల్!
అర్జున్ రెడ్డి, కబీర్, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు డిఫరెంట్ టేకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సందీప్ రెడ్డి వంగాతో సినిమా తీయాలని హీరోలంతా వెయిట్ చేస్తున్నారంటే ఆయన వేసిన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. తీసిన మూడు సినిమాలకే పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సందీప్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అదే స్పిరిట్.
ప్రభాస్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసిన సందీప్.. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుని దాదాపు రెండేళ్లుగా డార్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ నుంచి పూర్తి అనుమతులు రావడంతో న్యూఇయర్ రోజున స్పిరిట్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు సందీప్. బాగా హెయిర్ పెంచి.. గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా ఒళ్లంతా గాయాలతో వాటికి బ్యాండేజ్‌లతో రఫ్ లుక్‌లో ఉన్నాడు ప్రభాస్.

స్పిరిట్ ఫస్ట్‌లుక్‌తో సంచలనం
ఓ చేతిలో మందు పట్టుకుని నోటిలో సిగరెట్ పెట్టుకోగా.. అతనికి ఎదురుగా నిల్చొన్న హీరోయిన్ తృప్తి దిమ్రి లైటర్‌తో సిగరెట్‌ను వెలిగిస్తోంది. అయితే ప్రభాస్ ఫుల్ లుక్‌ని రివీల్ చేయకుండా కేవలం.. బ్యాక్ సైడ్ మాత్రమే చూపించారు సందీప్ రెడ్డి వంగా. ఈ పోస్టర్‌తో డార్లింగ్ అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. పోస్టరే ఇలా ఉంటే సినిమా ఇంకెంత వైల్డ్‌గా ఉంటుందోనని చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందోనని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశాడు. ఈ వివరాల్లోకి వెళితే..
వయలెన్స్‌తో సందీప్ సినిమాలు
స్పిరిట్‌లో ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగా ఎలాంటి కథను సిద్ధం చేశారనే దానిపై రకరకాల వెర్షన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్‌లు కాలేజీ బ్యాక్‌డ్రాప్, లవ్‌స్టోరీలు కాగా.. యానిమల్ మూవీలో తండ్రిని ప్రాణంగా ప్రేమించే కొడుకు, పగలు, ప్రతీకారాలతో నిండిన కథగా మలిచారు సందీప్. మరి స్పిరిట్ పరిస్ధితి ఏంటీ? అని ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే ప్రభాస్‌తో సందీప్ ఎలాంటి ప్రయోగాలు చేపడతాడోనని ఉత్కంఠ నెలకొంది.
స్పిరిట్ కథ ఏంటీ?
అయితే ఎక్కువ మంది మాత్రం ప్రభాస్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారని విశ్వసిస్తున్నారు. ఆయన పాత్ర కూడా మోస్ట్ వయలెంట్‌గా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ కూడా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్, అలనాటి నటి కాంచనలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారని టాక్. భద్రకాళీ పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌లు స్పిరిట్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.
స్పిరిట్ రిలీజ్ ఎప్పుడంటే?
అయితే.. స్పిరిట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు సందీప్ రెడ్డి వంగా. ఈ మేరకు జనవరి 16.. కనుమ పండుగ నాడు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. 2027 మార్చి 5న స్పిరిట్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సందీప్ తెలిపారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే స్పిరిట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











