ముంబై హోటల్‌లో వర్మతో సందీప్ రెడ్డి వంగా.. చిల్ అవుట్.. ఎందుకు కలిశారంటే!

Recommended Video

RGV & Sandeep Reddy Vanga Celebrates Kabir Singh Success In Mumbai || Filmibeat Telugu

ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ ముక్కుసూటిగా మాట్లాడే నైజం రామ్ గోపాల్ వర్మది. సినిమాను రియల్ లైఫ్‌కి దగ్గరగా చూపిస్తూ.. ప్రస్తుత ట్రెండ్‌కి వెండితెర రూపమిచ్చే తత్వం సందీప్ రెడ్డి వంగాది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ముంబైలో ఫుల్లుగా చిల్ అవుట్ అయ్యారు. ఎంచక్కా ముంబై లోని ఓ స్టార్ హోటల్‌లో ఎంజాయ్ చేశారు.

ముంబై హోటల్లో వర్మతో సందీప్ రెడ్డి వంగా

ముంబై హోటల్లో వర్మతో సందీప్ రెడ్డి వంగా

ముంబై లోని ఓ హోటల్ లో గత రాత్రి రామ్ గోపాల్ వర్మను కలిశారు సందీప్ రెడ్డి వంగా. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకుంటూ కబీర్ సింగ్ సక్సెస్ ఎంజాయ్ చేశారు. ఆల్రెడీ యమ క్రేజ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో, బాలీవుడ్‌లో ఇప్పుడిపుడే క్రేజ్ సంపాదించుకుంటున్న సందీప్ రెడ్డి వంగా కలవడం సెన్సేషన్‌గా మారింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'కబీర్ సింగ్' సక్సెస్ మూలంగా

ఇటీవలే విడుదలైన కబీర్ సింగ్ సినిమా ఊహించిన దాన్ని మించి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని రామ్ గోపాల్ వర్మ అభినందించారు. ముంబై లోని అల్ఫ్రెడోస్ హోటల్ లో మీట్ అయిన ఈ ఇద్దరూ కబీర్ సింగ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఫుల్లుగా చిల్ అవుట్ అయ్యారు.

మరోసారి సందీప్ రెడ్డి వంగానే

మరోసారి సందీప్ రెడ్డి వంగానే

తెలుగులో 'అర్జున్ రెడ్డి' పేరుతో వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాను 'కబీర్ సింగ్' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అర్జున్ రెడ్డికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించారు. 'కబీర్ సింగ్' చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించగా ఆయన సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. మొదటి షోతోనే బాలీవుడ్ ఆడియన్స్‌ని ఫిదా చేసింది కబీర్ సింగ్ సినిమా.

కలెక్షన్ల సునామీ.. 300 కోట్ల దిశగా

కలెక్షన్ల సునామీ.. 300 కోట్ల దిశగా

షాహిద్ కపూర్, కియారా అద్వానీ కెమెస్ట్రీ.. సందీప్ రెడ్డి వంగా టేకింగ్ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. తొలి రోజే పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్న బీ టౌన్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తూ ఇప్పటికీ 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయి 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది 'కబీర్ సింగ్' మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X