మహేష్ వద్ద మాట తీసుకుంటున్న స్పైడర్ డైరెక్టర్.. 2023 కోసం ఇప్పటి నుంచే..

దేశం మెచ్చిన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు ఏఆర్.మురగదాస్. గజిని సినిమాతో తన సత్తా ఏమిటో నేషనల్ వైడ్ గా నీరూపించుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఎక్కువ కాలం గుర్తిండిపోయేలా డైరెక్ట్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు. అయితే ఎందుకో ఈ దర్శకుడు ఇటీవల బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవడం లేదు.

మహేష్ బాబుతో ఎప్పుడైతే స్పైడర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడో అప్పటి నుంచి ఆయన సక్సెస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. మురగదాస్ గత రికార్డులే ఆయనపై ఓ వర్గం హీరోల్లో నమ్మకాన్ని కోల్పోనివ్వలేదు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఒక కథ డిస్కస్ చేయగా ఆయన చివరి నిమిషంలో రిజెక్ట్ చేశాడు. అనంతరం మురగదాస్ శివకార్తికేయన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Spyder director ar murugadoss special focus on mahesh dates

అయితే అతనితో సినిమా చేసెకంటే ముందే మురగదాస్ మహేష్ బాబు వద్ద మాట తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్పైడర్ డిజాస్టర్ కావడంతో తప్పకుండా మరో సినిమా చేద్దామని రెండేళ్ల క్రితమే అనుకున్నారట. ఇక ప్రస్తుతం మురగదాస్ మహేష్ బాబుకు ఒక కొత్త లైన్ వినిపించి ముందే ఒప్పందం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

ఎందుకంటే మహేష్ నెక్స్ట్ సర్కారు వారి పాట అనంతరం రాజమౌళితో బిజీ కానున్నాడు. అంటే మరో రెండేళ్ల వరకు దొరకడు. అందుకే 2023లో అయినా మహేష్ డేట్స్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X