SR Kalyanamandapam హీరో ఇంట తీవ్ర విషాదం: రక్త సంబంధాన్ని కోల్పోయిన కిరణ్ అబ్బవరం

తెలుగు సినీ పరిశ్రమను కొంత కాలంగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లను కోల్పోయిన టాలీవుడ్‌.. చాలా తక్కువ వ్యవధిలోనే చాలా మందిని దూరం చేసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మరణించారు. ఇది జరిగిన మరుసటి రోజే అంటే నేడు మరో సినీ హీరో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీతో సక్సెస్‌ను అందుకున్న కిరణ్ అబ్బవరం రక్త సంబంధాన్ని కోల్పోయాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

సినీ పరిశ్రమ మొత్తం విషాదంలోనే

సినీ పరిశ్రమ మొత్తం విషాదంలోనే

లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. బుధవారం ఉదయం ఆయన పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు అక్కడకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

టాలీవుడ్‌లో మరో విషాదకర ఘటన

టాలీవుడ్‌లో మరో విషాదకర ఘటన

'రాజావారు రాణివారు' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఎస్‌ఆర్ కల్యాణమండపం మూవీతో భారీ సక్సెస్‌ను అందుకున్న కిరణ్ అబ్బవరం ఇంట తీవ్ర విషాదం జరిగింది. అతడి సోదరుడు రామాంజులు రెడ్డి బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది.

యాక్సిడెంట్.. అక్కడికక్కడే మృతి

యాక్సిడెంట్.. అక్కడికక్కడే మృతి

కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి కడప జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం కారులో ప్రయాణిస్తుండగా.. కడప జిల్లా చెన్నూరు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామాంజులు రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కిరణ్ సోదరుడి మరణంతో మరొటి

కిరణ్ సోదరుడి మరణంతో మరొటి

నాలుగు రోజుల క్రితమే ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఈ క్రమంలోనే మంగళవారం సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారు. ఇక, ఇప్పుడు కిరణ్ అబ్బవరం సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇలా చాలా తక్కువ వ్యవధిలోనే పరిశ్రమకు షాక్‌లు తగిలాయి. ఇక, కిరణ్ కుటుంబానికి సినీ ప్రముఖులు సానుభూతిని తెలియజేస్తున్నారు.

సిరివెన్నెలకు నివాళి... ఇప్పుడిలా

మంగళవారం దిగ్గజ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ దురదృష్ట సంఘటనపై హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశాడు. ఈ మేరకు ఆ లెజెండ్ ఫొటోను షేర్ చేస్తూ.. 'పరిశ్రమకు భారీ నష్టం జరిగింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ పోస్ట్ చేశాడు. అది జరిగిన తర్వాతి రోజే రక్త సంబంధాన్ని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడతను.

Recommended Video

Choreographer Shiva Shankar Master శివైక్యం... ప్రముఖుల సంతాపం!! || Filmibeat Telugu
వరుస చిత్రాలతో జోరు.. అంతలోనే

వరుస చిత్రాలతో జోరు.. అంతలోనే

కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. 'ఎస్‌ఆర్ కల్యాణమండపం' తర్వాత జోరు పెంచిన అతడు.. 'సమ్మతమే', 'సెబాస్టియన్‌ పీసీ 524' అనే చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే మరో సినిమాను కూడా ప్రారంభించేశాడీ యంగ్ హీరో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X