twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భళా తందనాన’ మొదలు.. పుల్ స్పీడ్‌లో శ్రీ విష్ణు

    |

    శ్రీ విష్ణు ఎంచుకునే కథలు, చేసే సినిమాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. చిన్న చిన్న పాత్రలు చేస్తూనే హీరోగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమా ఫలితాలు ఎలాగున్నా కూడా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటాడు. చివరగా వచ్చిన గాలి సంపత్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే శ్రీ విష్ణు పాత్రకు, నటనకు మంచి పేరు వచ్చింది. తాజాగా శ్రీ విష్ణు తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలెట్టేశాడు.

    అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

    భళా తందనాన అంటూ రాబోతోన్న ఈ మూవీని వారాహీ చలనచిత్రం బ్యానర్‌లో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నాడు. 'బాణం' సినిమాతో తన సత్తాను చాటిన దర్శకుడు చైతన్య దంతులూరి మరో విభిన్న కథను ఎంచుకుని శ్రీ విష్ణుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. శ్రీవిష్ణు, కేజీయఫ్ విలన్ గరుడ ( రామ చంద్రరాజు), కేథరిన్ వంటి వారు ఈ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రాజమౌళి ఫ్యామిలీ హాజరవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

    Sree vishnu Bhala Thandanana Shoot started

    అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. నేడు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈమేరకు శ్రీ విష్ణు ఓ పోస్ట్ చేశాడు. లైట్స్ కెమెరా యాక్షన్ అంటూ నేడు భళా తందనాన షూటింగ్ మొదలైందని తెలిపాడు. సీన్ వన్ షాట్ వన్ టేక్ వన్ అనే క్లాప్ బోర్డ్‌ను పోస్ట్ చేశాడు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో శ్రీ విష్ణు వెరైటీ రోల్‌లో కనిపించబోతోన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Sree vishnu Bhala Thandanana Shoot started, KGF Garuda In Sree vishnu Bhala Thandanana,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X