twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bhala Thandhanana: ఆ పవర్ చేతిదా సీఎం కుర్చీదా? సరికొత్తగా శ్రీవిష్ణు సినిమా టీజర్

    |

    బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలోనే సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటుతున్నాడు శ్రీవిష్ణు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేమైన శైలిని ఏర్పరచుకున్నాడు. నేచురల్ యాక్టింగ్‌తో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు. అదే సమయంలో హిట్లు ఫ్లానులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో కొత్త దర్శకులను సైతం పరిచయం చేస్తున్నాడు. దీంతో శ్రీవిష్ణుకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు.

    బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

    గత ఏడాది శ్రీవిష్ణు మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అందులో ఆరంభంలోనే వచ్చిన 'గాలి సంపత్' నిరాశనే మిగిల్చింది. కానీ, ఆ తర్వాత విడుదలైన 'రాజ రాజ చోర' మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఈ ఉత్సాహంతోనే ఈ యంగ్ హీరో ఆ వెంటనే 'అర్జున ఫల్గుణ' అనే సినిమాను చేశాడు. ఈ సినిమాకు మాత్రం అనుకున్న రీతిలో స్పందన మాత్రం దక్కలేదు. దీంతోపాటు ఆరంభంలోనే దీనికి ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా అనుకున్న విధంగా రాలేదు. ఫలితంగా శ్రీవిష్ణుకు ఈ సినిమా వల్ల భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

    Sree Vishnus Bhala Thandhanana Teaser Released

    హిట్లు ఫ్లాపులతో సాగిపోతోన్న శ్రీవిష్ణు.. ప్రస్తుతం 'భళా తందనాన' అనే సినిమాలో నటిస్తున్నాడు. చైతన్య దంతులూరి అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కేథరిన్ థ్రెస్సా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్రీకరణను శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఈ నేపథ్యంలో దీన్ని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు.

    శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు: వరల్డ్ మొత్తంలో మూడో స్థానం.. ఇండియాలోనే నెంబర్ వన్శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు: వరల్డ్ మొత్తంలో మూడో స్థానం.. ఇండియాలోనే నెంబర్ వన్

    శ్రీవిష్ణు నటించిన 'భళా తందనాన' టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించారు. 'రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి. కానీ, నేను మామూలు మనిషిని' అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్‌ను పరిచయం చేయడం.. వీళ్లిద్దరూ కలిసి ఒకే టార్గెట్‌ను చేరుకోవడానికి ప్రయత్నించడం ఇందులో ప్రధానంగా చూపించారు. మధ్యలో 'లంచం లేకపోతే కంచంలోకి అన్నం కూడా రావాట్లేదు' అనే డైలాగ్‌ మెప్పిస్తోంది. ఇక, చివర్లో శ్రీవిష్ణు 'సీఎం కూర్చిలో కూర్చున్న ఎవరైనా.. ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్‌నే మార్చేయొచ్చు. అంటే ఆ పవర్ చేతిదా? లేక కుర్చీదా?' అంటూ చెప్పే డైలాగ్‌తో ముగుస్తుంది.

    ఇంత కాలం కామెడీ రోల్స్‌తో మెప్పించిన శ్రీవిష్ణు.. చాలా కాలం తర్వాత సీరియస్ యాక్షన్‌తో చేసిన చిత్రమే 'భళా తందనాన'. టీజర్‌లో అతడి క్యారెక్టర్ ఎంతో హైలైట్‌గా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక, ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజినీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. మణి శర్మ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి, సత్య తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

    English summary
    Tollywood Talented Hero Sree Vishnu Now Doing Bhala Thandhanana Movie Under Chaitanya Dantuluri Direction. Now This Movie Teaser Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X